నాన్న త్యాగశీలి: - -ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు (ఋష్యశ్రీ)-సారవకోట-చరవాణి: 9490904976


తండ్రి జీవన కారకుడు..
నిన్ను, నీ కుటుంబానికి పోషకుడు..

నీ వెన్నంటే ఉండి నిన్ను నడిపించేది నాన్న..
నీకన్నీ సమకూర్చేది నాన్న..

బడి, గుడి, మడి 
అన్నింటికీ తీసుకువెళ్ళేది నాన్న..
బంధాలు, అనుబంధాలు గూర్చి చెప్పేది నాన్న..

ఒరవడి రాయించేది నాన్న..
నీ నడవడి చూసేది నాన్న..

తడబడితే సరిచేసిది నాన్న..
తప్పులు చేస్తే నిన్ను
ఖండించేది, దండించేది నాన్న..
దిద్దేంచేది, సరిదిద్ధేది నాన్న..

నాన్నను ఎడం పెట్టకు..
నీ కుడి భుజం నాన్న..
నాన్న నీ దన్ను, నీ వెన్ను..

అమ్మ కన్నైతే నాన్న చూపు..
నీకు సరైన దారిచూపు..
నాన్న అడ్డు, జిడ్డు కాదు..
నావను నడిపించే నావికుడు..
ఒడ్డుకు తెచ్చే తెడ్డు లాంటోడు..
దర్శకుడు, మార్గదర్శకుడు..

మనసున్న నాన్న..
మన కోసమే నాన్న..

ముద్దు మురిపెంగా పెంచారు నాన్న..
ముచ్చట్లు చెప్పారు నాన్న..

వ్రేలు పట్టి నడిపించారు..
వేలు కట్టి చదివించారు..

ధైర్యం చెప్పారు..
స్థైర్యం ఆందించారు..

భయాన్ని పారద్రోలారు.
జయాన్ని  రుచిచూపారు..

కష్టాలు పడ్డారు..
నష్టాలు చూసారు..
ఇష్టాలు తీర్చారు..

పస్తులు ఉన్నారు..
సుస్తులు పడ్డారు..

వస్తువులు, దుస్తులు ఇచ్చారు..
ఆస్తులు, అంతస్తులు నీకై ప్రోగుచేసారు..

అవస్థలు చూసారు
అవమానాలు ఎదుర్కొన్నారు.
అగచాట్లు పడ్డారు.

కంటి నిండా నిద్రకు కరువయ్యారు..
కుటుంబానికి త్యాగశీలిగా మిగిలారు.

సర్వం నీకు, కుటుంబానికి సమకూర్చారు..
సమస్తం అర్పించారు, సమర్పించారు..

గరళకంఠునిలా బాధల్ని  దిగమ్రింగారు..
మేరునగధీరుడుగా నిలిచారు..

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం