పిచ్చి పట్టినోడు పచ్చి మోసగాడు
పగటి వేషగాడు పాగా వేసేటోడు
ఎవడురా మాతెలంగాణ గడ్డమీద
తన కాలు పెట్టి విర్రవీగే వెర్రివాడు!
తన నోటికొచ్చినట్లు దురుసుగా
తెగ మాటలాడు ఈ మాయగాడు
అభం శుభం ఎరుగని తెలంగాణ
భూమి పుత్రులను తెగ తిట్టేటోడు
తెలంగాణ మీ తాత జాగీరా అని
మనల గెలిచేయు వీడు వెర్రివాడు
తెలంగాణ చరిత్ర తెలియనివాడు
తాగి తూలి కింద మీద పడేటోడు!
అవును తెలంగాణ మా జాగీరు
అని చెప్తాం మేము ఇక బరాబర్
తెలుసుకో తెలివిగాను ఇక నీవు
తెలంగాణ ఆటలో కాలేవు పావు
రేవంత్ అండతో మురుస్తుంటడు
మనం తిరగబడితే కంగుతింటడు
మొరిగే కుక్కలాగా అరుస్తుంటడు
మన గజరాజుకు జడుస్తుంటడు !
కుక్కలా తన తోక ఊపుకుంటూ
తెలంగాణ బార్డర్ను దాటుకుంటు
పరుగో పరుగంటు పారిపోతుండు
ఎవడు వాడురా వాడేరా ఆంధ్రోడు!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి