ఎవడురా?: - గుర్రాల లక్ష్మారెడ్డి -సెల్.9491387977. కల్వకుర్తి
ఎవడురా ఎవడురా ఎవడురా
ఆంధ్ర నుండి తెలంగాణ కొచ్చి
తెలంగాణ వాసులను గెలిగిచ్చి
సూటి పోటి మాటలను అన్నది !

తెలంగాణలో తాను అడుగుపెట్టి
తెలంగాణ భూములనే  కొల్లగొట్టి  
తాత జాగీరా అని ప్రశ్నించిన అట్టి
ఆంధ్రవాడు ఎవడురా ఎవడురా?

వేషాలు వేసి పలు మోసాలు చేసి
సినిమా డైలాగులను తాను కూసి
ఎత్తులజిత్తులతో మనల పడవేసి
జనసేనను ఏర్పాటు చేసినవాడు

భారతదేశంలోనే తెలంగాణ ఉంది
పోటీ చేస్తే లేదు మాకు ఏ ఇబ్బంది
అడ్డు కూడా చెప్పరు మా సిబ్బంది
రా పోటీ చెయ్ గెలువు మా తోటి!

తెలంగాణకై మా ప్రాణమైన ఇస్తం
నీ జనసేన బలం అంతు చూస్తాం
గుర్తుంచుకో బిడ్డా ఇది మా అడ్డా
మేం పుట్టి పెరిగిన మా పురిటి గడ్డ  


కామెంట్‌లు