ప
వందనంవందనంగురువుదేవులకువందనం
వందనం వందనం వందితాఖిలసుందరం
సుందరం సురుచిరం జ్ఞానినామభివందనం
వందనంవందనంయభినందనచందనం
చ
అజ్ఞానపు చీకట్లను తొలగించి
విజ్ఞానపు జ్యోతులనేవెలిగించి
ప్రజ్ఞాకుసుమాలనువిరబూయించి
సుజ్ఞానోక్తులబోధనగావించి
చ
ప్రగతికిచక్కనిమార్గములజూపించు
జగతికినాదర్శమునైనడిపించు
భగవంతునిస్వరూపుడైభాసించు
జగమంతటఖ్యాతిని ప్రసాదించు
చ
విద్యాగంధమ్ములనుపదేశించు
విద్యోద్యానములోవిరబూయించు
విద్యాసరస్వతినినారాధించు
విద్యార్థులమిన్నగరూపొందించు
చ
గురువులబోధనలనునాలకించి
విరివిగజ్ఞానమ్మునుసముపార్జించి
సరియగుమార్గమ్ములోనపయనించి
స్థిరమగయశములచేతప్రకాశించు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి