స్నేహం (అవధుల్లేని ఆనందం) : - అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497
అపసవ్యనడతను 
మార్చే విప్లవాత్మకమైన
మార్గం 

అనంత విశ్వంలో
ఏ సంబంధం లేని 
ఏమీ ఆశించని 
మన ఎదుగుదల కాంక్షించు
ఓకే ఒక్క ప్రాణి 

ఏ ఓటమెరుగని
విజయపుమర్మం
అదే అదే స్నేహం 
అది అమరం
అజరామరం 

కులమతాలను దూరంపెట్టు
ఆయుధం 
మతపు
మకిలీ అంటని
సమసమాజపు 
పై మెట్టు 
యుధ్ధాన్నైనాగూల్చు
మార్గోపదేశం

స్నేహం 
కన్నతల్లిలా లాలించేది 
నాన్నలా
ముందుకు నడిపేది 

బాధల్లో ఓదార్పు గీతం 
సంతోషంలో ఆత్మీయాలింగనం
 ప్రాణ స్నేహితుడు ఒక్కడుంటే
ఈ ప్రపంచమే మనకు దాసోహం 

ఆర్థిక బంధాలన్ని వ్యాపారమయమైనవే
ఇచ్చిపుచ్చుకునే చోట 
స్నేహానికి చోటెక్కడుంది 

నా అన్నవాళ్ళు 
ఎవరూ లేని రోజున 
ఆప్తమిత్రుడొక్కడుంటే చాలు 
ఈ భూతలాన మనకన్నా ధనికుడెవరుంటారు!?


కామెంట్‌లు