అందరివాడు మా నాన్న
నాన్న దయాసాగరుడు
తాను కన్న బిడ్డలు పాలిట కల్పవృక్షం
త్యాగానికి కేరాఫ్ అడ్రస్ నాన్న
అచంచలమైన ప్రేమాభిమానాలకు
నిలయం మా నాన్న
నిత్య శ్రామికుడు
తన (మన)కుటుంబానికి వెన్నెముక
నాన్న
తనలో బాధలఅగాధాలెన్నున్నా
బహిర్గతపరచని
స్థిర చిత్తడు నాన్న
నాన్నే బిడ్డలకు తొలి కథానాయకుడు
గురువు, స్నేహితుడు
తాను గరళం సేకరించి
అమృతాన్నిబిడ్డలకు పంచే
ఆ శివయ్యే మా నాన్నంటే

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి