రేడియో: - వరుకోలు లక్ష్మయ్య -తెలుగు భాషోపాధ్యాయులు-జిపఉపా: బక్రిచెప్యాల-9704865816
రేడియో రేడియో 
మధురమైన రేడియో 
రాగాలు వినిపించే 
రమ్యమైన రేడియో
 
చిన్నారి హృదయాలకు 
చెలిమైనా రేడియో 
చిరునవ్వులు పంచేటి 
చక్కనైన రేడియో

వందేమాతరం తోటి 
మనలమేలుకొల్పును
భక్తి గీతాలతోటి
భక్తి మనలో నింపును

విశ్వములో జరిగేటి
వింతలన్ని జెప్పును 
దేశ విదేశ సంగతులను
విప్పిచెప్పుచుండును

పొలం పనుల విషయాలు 
రైతులకందించును 
పాడిపంటలవిషయాలు
పల్లె వాసులకు చెప్పును

జానపద గేయాలు 
బుర్రకథలు,హరికథలు 
జనులనుత్సాహపరచే
సంస్కృతినేతెలియజేయు

పద్యాలు,పాటలతో 
పామరుల మురిపించును 
విద్యార్థులకు విజ్ఞానపు
విషయాలను తెలుపును

శాస్త్రవేత్తల మాటలతో
శాస్త్రీయత ప్రసాదించు 
ఆటలు క్రీడల విషయాలు 
కళ్ళ ముందు నిలుపును

గాలి,తుఫాను,వడగండ్ల 
వార్తల ముందే చెప్పును 
పల్లెటూరిగీతాలను 
మధురంగా వినిపించును

అమ్మమ్మ కథ చెబుతుంటే 
ఆప్యాయత గుర్తొచ్చును
టీవీ ఫోన్లు వచ్చినా
తన విలువ తగ్గలేదు

మనసులను హత్తుకునే 
మాధుర్యమే మనకుపంచు!!
ఉండాలి  ప్రతిఇంట
రేడియో మనచెంత


కామెంట్‌లు