నిన్న మొన్నటి వరకూ
రణగొణల గొంతులో ఎగిసిన రవ్వలు
విరిగిన వాక్యములో
లయ తప్పిన భావోద్వేగం
పంక్తుల నడుమ విరామ మైదానం
మూసిన కిటికీ కన్ను దృశ్యించిన
గొంగళి దూరిన బాధ
నాలుగు గోడల కప్పు కింద బందీయై...
అక్షరమంత స్వేచ్ఛాజీవి
కేజ్డ్ బర్డ్
విరిగిన ముక్కాలు పీటలా
విశ్రాంతిలో
మనసు మయూర నర్తన జిహ్వకు
కవిత,కథ పరామర్శ ఊరట నింపే సౌహార్ద్ర జీవులు
ఓ వెచ్చని చేతి స్పర్శ కొత్త అల్లిక అలుముకున్నది చల్లని అక్షరమై
చిట్లిన మోకాలు చిప్ప, చీలమండ దెబ్బగాయం
ఆరు వారాల మంచంపైని కంచం మైత్రి
ఒక పలకరింపు,ఓ పరామర్శ విశ్రాంతి వేళ...
తెరుచుకున్న గుమ్మం తలుపు కిర్ కిర్ చప్పుడు పలకరింపుగా
ఎంత ప్రేమ మూర్తి,అక్షరాల కుదురైన కవిత్వంలా
ఎగిరి గంతేసేలే సాహిత్య విహంగ మనసు
దాహం తీర్చే తోయం ఎదురొచ్చిన క్షణం!
కుశల ప్రశ్నలు,కవిత్వ సంభాషణలో మునక అక్షర జీవులు
టీ పాయ్ మీద తీపిబెల్లపు ప్రసాదం
మేడంగారి మధుర వాక్కే ఆత్మీయత!
దృష్టి డాక్టర్ గా
బలవంతపు విశ్రాంతి బాధలో తగిలిన కాలుదెబ్బ పరిశీలన,
త్వరగా నడిపించే కాన్సెప్ట్
వైద్యసలహా విధిలో విధిగా పాటిస్తూ...
మరో రెండు వారాల రెస్ట్ మెల్లగా చల్లగా మాట గుచ్చని బాణంలా
అది ఎంత కష్టమో తెలుసు... తప్పదు మరి!
అలా సాగిసాగిన వైద్య స్పర్శ
విలువైన సాహిత్య చింతన తోటలో మేము
మిత్రునిలో 'దేహం కురిసిన వర్షం' పొత్తం చూసిన కొసమెరుపుగా
రెండు దశాబ్దాలు దీర్ఘకాలం కదా 2025లో మీ కవిత్వం రావాలనే ఆత్మీయ ఆకాంక్ష కనులలో
ఎంత గొప్ప సలహానో
అంతే చనువు స్వర చిరునామా!
కవిత్వం వైద్యం చేసింది కదా
నవ్వింది ఆరోగ్యం
అనంత ఆకాశమై నమ్మంగా...
====================================================================
(*దాదాపు ఆరేడునెలల కింద 2025లో సాహితీమిత్రులు విల్సన్ రావు కొమ్మవరపు గారు కాలు దెబ్బతో రెస్ట్ పర్వంలో నా పరామర్శచికిత్స కవిత ఇది...)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి