పక్కింటి బాబాయి తమ్ముడు రాడా
ఎదురింటి చిన్నమ్మ చెల్లెమ్మ రాదా
బడిగంట మోగింది బడికి పోవాలి
బడిబాట నడవాలి బాగ చదువాలి
. "బడి"
సర్ధుకో చెల్లెమ్మ పుస్తకాలు సంచి
నడవరా వడివడిగ నా చిట్టి తమ్ముడు
గేట్లు తెరుచుకొని ఎదురు చూస్తున్నది
రమ్మని పిలిచేటి అమ్మ తానయ్యింది
"బడి"
ఆటపాటలతోటి చుదువుకోమంటుంది
అందరితో కలిసి ఆడుకోమంటుంది
స్నేహంగ ముందుకు సాగిపోమంటుంది
బడియంటెనే..........
అమ్మ ఒడియనితెలుసుకోమంటుంది
"బడి"
జ్ఞానాన్ని పంచేటి సార్లు మనకున్నారు
వివరంగ వివరాలు విడమరచి చెబుతారు
మంచి చెడ్డలు తెలిపి మసలుకోమంటారు
లోకంలొ ఎట్లుంటె మంచిదొ తెలిసొస్తది. "బడి"
ఎదురింటి చిన్నమ్మ చెల్లెమ్మ రాదా
బడిగంట మోగింది బడికి పోవాలి
బడిబాట నడవాలి బాగ చదువాలి
. "బడి"
సర్ధుకో చెల్లెమ్మ పుస్తకాలు సంచి
నడవరా వడివడిగ నా చిట్టి తమ్ముడు
గేట్లు తెరుచుకొని ఎదురు చూస్తున్నది
రమ్మని పిలిచేటి అమ్మ తానయ్యింది
"బడి"
ఆటపాటలతోటి చుదువుకోమంటుంది
అందరితో కలిసి ఆడుకోమంటుంది
స్నేహంగ ముందుకు సాగిపోమంటుంది
బడియంటెనే..........
అమ్మ ఒడియనితెలుసుకోమంటుంది
"బడి"
జ్ఞానాన్ని పంచేటి సార్లు మనకున్నారు
వివరంగ వివరాలు విడమరచి చెబుతారు
మంచి చెడ్డలు తెలిపి మసలుకోమంటారు
లోకంలొ ఎట్లుంటె మంచిదొ తెలిసొస్తది. "బడి"

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి