నవ్వు ముఖం అందం : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
చిరునవ్వుల వదనాలు 
విరబూసిన కుసుమాలు 
వెదజల్లును అందాలు 
పెనువేయును బంధాలు 

నవ్వుతోనే లాభాలు 
జీవితాన కోకొల్లలు 
నవ్వు దివ్య ఔషధము 
చేకూర్చును ఆరోగ్యము 

నవ్వులోనే మోదము 
అదే లే

క ఖేదము 
దరహాసము మధుమాసము 
జీవితాల్లో అవసరము 

అనారోగ్యాలకు సెలవు 
మేలులెన్నో కలవు 
నవ్వులేని ముఖాలు 
అందవిహీనానికి నెలవు 

కామెంట్‌లు