స్నేహమే బహుమానం : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
చెడ్డ వారి  సాంగత్యము 
చెరుపును చక్కని నడవడి 
దుష్ట పనులే చేయకు 
దుర్మార్గులకు భయపడి 

మంచి వారి స్నేహమే 
పరిమళించే గంధమే 
జీవితంలో దొరుకుట 
పరికింపగ అదృష్టమే 

భగవంతుని బహుమానము 
శ్రేష్టమైన సహవాసము 
కాపాడుకుంటే మేలు 
బ్రతుకులోన పదివేలు 

కాంతిమయమే స్నేహము 
శాంతినిచ్చును సాధనము 
చివరివరకు గొప్పగా 
కల్గియున్న మేలేగా! 


కామెంట్‌లు
Popular posts