సూరంపల్లి గ్రామంలో సురేష్, మహేష్ ప్రాణ స్నేహితులు. మహేష్ చదువుకుని విదేశాలకు వెళ్ళి బాగా డబ్బు సంపాదిస్తున్నాడు.కానీ సురేష్ మాత్రం ఊర్లోనేఉండిపోయాడు.పని లేకపోవడంతో ఊరి జనం అతన్ని ఎందుకూ పనికిరానివాడుఅనేవారు.
సురేష్ లోలోపల బాధపడుతుండేవాడు.
కొన్నిరోజులకు మహేష్ విదేశాల నుండి ఊరికి వచ్చాడు.
తన స్నేహితుడు ఎలా ఉన్నాడో తెలుసు కుందామని
సురేష్ ఇంటికి వెళ్తాడు. అరేయ్ సురేష్! బాగున్నావా రా? ఏం చేస్తున్నావ్ అని పలకరించాడు.
సురేష్ ఏం లేదురా..!అని బాధగా అన్నాడు.
మనం ఇద్దరం కలిసి ఒక డైరీ ఫామ్ (పాల వ్యాపారం) పెడదామా!మహేష్ అన్నాడు.
డైరీ ఫామా? దానికి చాలా డబ్బులు,అనుభవం కావాలి కదరా?నా దగ్గర రెండూ లేవు అన్నాడు సురేష్.
డబ్బు నేను పెడతాను,అనుభవాన్ని సంపాదిద్దాం.నా వద్ద ఒక ఉపాయం ఉంది. వ్యాపారం మొదలుపెట్టే ముందు, అసలు ఆ పని ఎలా ఉంటుందో మనం ముందు నేర్చుకోవాలి.ఊరి చివర పెద్ద డైరీ ఫామ్ నడుపుతున్న ఒకాయన నాకు తెలుసు. అక్కడ నెల రోజులు జీతం లేకుండా పనివాళ్లుగా చేరదామని మహేష్ అన్నాడు.
మహేష్,సురేష్ ఇద్దరూ తెల్లవారుజామునే లేచేవారు.
బర్లకొట్టం శుభ్రం చేయడం, పెండ ఎత్తడం.
పశువులకు మేత (గడ్డి) వేయడం, సమయానికి నీళ్లు తాగించడం.
నీళ్లలో తవుడు, దానా కలిపి పెట్టడం.
పాలు పిండడం... ఇలా ప్రతి ఒక్క పనిని ఇద్దరూ సొంతంగా నేర్చుకున్నారు.
సురేష్‌లో పట్టుదల పెరిగింది. నెల రోజులు గడిచేసరికి అనుభవం వచ్చింది. మహేష్, సురేష్‌ను పట్టణానికి తీసుకెళ్లాడు. అక్కడ మంచి జాతికి చెందిన 30 బర్రెలు, 20 ఆవులు, 10 దున్నపోతులను కొనుగోలు చేశారు. ఊరి శివార్లలో ఒక పెద్ద డైరీ ఫామ్ ఏర్పాటు చేశారు.
ఇద్దరూ కలిసి తెల్లవారుజామునే లేచి, పిండిన పాలను పట్టణానికి తీసుకెళ్లి అమ్మడం మొదలుపెట్టారు.వ్యాపారం లాభాల బాట పట్టింది.
మహేష్,సురేష్ చేతిలో డైరీ ఫామ్ పత్రాలన్నీ పెట్టాడు.
సురేష్ ఆశ్చర్యంగా, ఏంటిదిరా? అన్నాడు.
ఔను విదేశాల నుండి వచ్చింది.నీ కోసమేరా. ఇప్పుడు నీకు పని వచ్చు,వ్యాపారం ఎలా చేయాలో తెలుసు.ఈ డైరీ ఫామ్ నీదే. దీన్ని నువ్వే చూసుకోవాలి.నేను మళ్లీ విదేశాలకు వెళ్తున్నాను.
సురేష్ కళ్లలో నీళ్లు తిరిగాయి.డబ్బు సాయం చేయడం కంటే, బ్రతికే మార్గాన్ని చూపించడమే నిజమైన స్నేహమని సురేష్ కు అర్థమైంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి