మార్పు: - యస్.హిందు-9వ,తరగతి-జి.ప.ఉ.పా.రామంచ-మం:చిన్నకోడూరు-జి:సిద్దిపేట

 

 నరసింహపురం అనే ఊరిలో నాగయ్య దుర్గయ్య అనే స్నేహితులు ఉండేవారు. వారిలో నాగయ్య మాత్రం ఎవరితో వాదాలు ఆడకుండా నిజాయితీ గా ఉండేవాడు. మరియు ఊరి ప్రజలు అందరూ అతడిని ఒక దేవుడిలాగా చూసేవారు కానీ, దుర్గయ్యను ఎవ్వరు పలకరించిన కోపంతో వారిని తిట్టి పంపేవాడు. అది చూసిన తన స్నేహితుడు నాగయ్య ఆరేయ్ దుర్గ ఎవరు మనల్ని పలకరించిన వారితో ప్రేమగా మాట్లాడాలి .కానీ కోపంతో తిట్టి వారిని పంపితే వారు చాలా బాధపడతారు మరియు నీకు అవసరం ఉండి, మాట్లాడిన వారు మాట్లాడరు అని చెప్పేవాడు. కానీ ఆయన మాట వినేవాడు కాదు. ఒకరోజు నాగయ్య ఎలాగైనా దుర్గయ్య లో మార్పు తేవాలని అనుకుని దుర్గయ్య తో ఇలా అన్నాడు దుర్గా మనం మన ఊరి ప్రజలకు అన్నదానం పెట్టుదాం. కానీ నువ్వు ఒక రోజు నేను ఒక రోజు అని చెప్పాడు. మరుసటి రోజు నాగయ్య అన్నదానం పెట్టాడు. అక్కడికి ఊరి జనం అందరూ వచ్చి భోజనం చేశారు అలాగే మరుసటి రోజు దుర్గా కూడా అన్నదానం పెట్టాడు కానీ ఎవ్వరు రాకపోవడంతో ఆయన నాగయ్య దగ్గరకు వెళ్లి, జరిగిన విషయం అంతా చెప్పి బాధపడ్డాడు. దుర్గ నువ్వు బాధపడకు నీవు చేసిన తప్పు నీకు అర్థమైందా నీవు వారిని ఎక్కడా కోపంతో తిడతావో అని వారు రాలేదు అని చెప్పాడు. అప్పుడు దుర్గ ఇలా అన్నాడు నన్ను క్షమించండి నాగయ్య నీవు చెప్పిన నేను అప్పుడు వినేవాడ్ని కాదు ఇప్పటినుండి నేను అందరితో కోపంగా కాకుండా మర్యాదగా ఉంటా అని చెప్పాడు. తన మిత్రుడిలో వచ్చిన మంచి గుణాన్ని చూసి నాగయ్య చాలా సంతోషించాడు

కామెంట్‌లు