దట్టమైన అడవిలో గాడిద, గుర్రం నివసించేవి.అవి మంచి స్నేహితులు.ప్రతి రోజు కలిసి మేతకు వెళ్లి,అడవిలోని జంతువులతో ఆనందంగా గడిపేవి.
ఒక రోజు గుర్రం మేతకు వెళ్తుండగా గాడిద ఎదురైంది.
మిత్రమా!ఎటు వెళ్తున్నావు? అని గుర్రం అడిగింది.
మేత కోసం వెళ్తున్నాను,అని గాడిద చెప్పింది.
అయితే నేనూ నీతో వస్తాను, అంది గుర్రం.
అలా ఇద్దరూ కలిసి మేత మేస్తూ,ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ సంతోషంగా గడిపేవారు.
ఒక రోజు గుర్రం ఎప్పటిలాగే గాడిద కోసం ఎదురుచూసింది.చాలా సమయం గడిచినా గాడిద రాలేదు.గుర్రానికి భయం కలిగింది.
నా మిత్రుడికి ఏమైందో? అని దానిని వెతకడానికి గుర్రం బయలుదేరింది.
మధ్యలో ఒక సింహం ఎదురైంది.గుర్రాన్ని చూసి గట్టిగా గర్జించింది.ఆ సప్పుడుకు గుర్రం భయంతో పరుగెత్తసాగింది.చివరకు గాడిద ఉన్న చోటుకు చేరుకుంది.అక్కడ గాడిద ఒక వేటగాడు వేసిన వలలో చిక్కుకుని బాధపడుతూ కనిపించింది.
తన మిత్రుడిని చూసి గుర్రం చాలా బాధపడింది.
భయపడకు మిత్రమా!నేను నిన్ను తప్పకుండా కాపాడుతాను,అని గుర్రం ధైర్యం చెప్పింది.
గుర్రం దగ్గరలో ఉన్న చెట్లకు పొడుగు కర్రలు తెచ్చి వలను లాగింది.కొద్దిసేపటికి వల తెగిపోయి గాడిద బయటపడింది.
నువ్వు రాకపోతే నేను ఈ రోజు బతికి ఉండేవాడిని కాదు అని గాడిద ధన్యవాదములు చెప్పింది.
స్నేహితులు కష్టసమయంలో ఒకరికొకరు తోడుగా ఉండాలి. అదే నిజమైన స్నేహం అని గుర్రం చెప్పింది.
ఆ రోజు నుంచి అవి మరింత కలిసిమెలిసి జీవించాయి.
నీతి: ఆపదలో అండగా నిలిచేవాడే నిజమైన స్నేహితుడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి