కష్టజీవి రైతు: - జి.దీపిక-9వ,తరగతి-జి.ప.ఉ.పా.రామంచ-మం:చిన్నకోడూరు-జి.సిద్దిపేట


జగతికి మూలం రైతు
జనులందరికీ, అన్నదాత రైతు
రైతు దేశానికి వెన్నెముక
ఆకలి తీర్చే అన్నదాత
రైతు లేనిదే జగతి లేదు
ఎండలో రోజంతా పనిచేస్తూ
ఎండనక వాననక కష్టపడుతూ
చలిలో నాగలితో దున్నుతూ
ఎండలో మండుతూ ఏడ్చే రోజులెన్నో
పనిలో నిమ్మిగ్నమై పస్తులుంటూ
వర్షాలు పడక వగచిపోతూ
తల్లడిల్లి బాధతో తట్టుకోలేక,
భూదేవిని ప్రతిక్షణం వేడుతూ
దేశానికి ఒక రక్షణగా నిలుస్తూ
తన కుటుంబం కాకుండా
దేశం కోసం  పరిత
పిస్తూ
ఎల్లప్పుడూ ఆకలితో అలమటిస్తూ
తన ప్రాణం పణంగా పెట్టి శ్రమిస్తాడు
రైతు వృత్తి కన్నా గొప్పదేది లేదు,
రైతు లేక ఆహారం లేదు
అన్నదాతను అవమానించకు
గౌరవించడం మన కర్తవ్యం

కామెంట్‌లు