ప్రాణవాయువు
ప్రాణికోటికి
జీవధార
కార్బన్ వాయు
జీవరాశికి
మృత్యుఛాయ
సముద్ర అలలు
జలచరాలకు
ఆటవెలది
చేప మాంసం
తీరప్రజలకు
బలవర్ధకం
కప్ప బెకబెక
వాన రాకకు
ముందు జాడ
మట్టి వాసన
వీసే గాలిలో
వాన జాడ
ఎలుక పరుగు
బొరియ విడిచి
భూకంప జాడ
వాగు వంకలు
వన్యజీవులకు
జీవధార
సముద్ర జలం
లవణ సంపదకు
పుట్టినిల్లు
సాగర గర్భం
ముత్య రత్నాల
గుప్తనిధి
పర్వతాలు
వజ్ర సంపదకు
నిలయాలు
భూగర్భం
ఖనిజాలకు
నిధినిలయం
అడవంతా
వన్యజీవులకు
ఆలవాలం
రాళ్ల వాన
పండ్ల తోటలకు
మృత్యుఘంట
మంచు పొరలు
వాహనాలకు
ప్రమాదమే
వడగాలులు
జీవజాతికి
మృత్యుఘంట
పురుగులు
బల్లులకవి
విందు భోజ్యం
ఎలుకలు
పాములకవి
ఆహారమే
వర్ష ఋతువు
వాన జల్లుల
వరాల మూట
హేమంతం
హిమపాతాలకు
జన్మభూమి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి