దాన్నిండా అమృతం ఉంది.
వెండి వెన్నెల నీళ్లు పోసి పాతాళ లోకంలో పెంచిన
అడవుల నిండా పసిడి గుండెలు కాసినవి.
ఆకాశం నిండా పూసిన నక్షత్రాలు గుండెలు చీల్చి నిటారుగా నీకోసం నిలబడ్డవీ.
అమాయక లోకం కన్నీరు హిమాలయాల్లో ఎదుగుతున్నవి.
కుంకుమ పూలు ఎర్రని కళ్ళల్లో పూసి పూసి లోయల్లోకి దూకుతుంన్నవీ.
పసుపు పచ్చని ఆకాశంలో సూర్యుళ్ళు కళ్ళు మూస్తున్నారు.
ఉరుములు మెరుపుల నల్లని ఆకాశంలో పిడుగులు రాల్చి న పగడపు వడగల్లు ఎడారుల కౌగిలిలలో రాలిపోయాయి
వెలుగుతున్న దీపం గాలిపంజరంలో చిక్కుకొని బిక్కుబిక్కు మంటుంటే గోడలు కట్టిన మందిరం మౌనంగా మూగబోయింది.
పాల సముద్రంలో నిద్రిస్తున్న వేల కన్యలు కలలు కంటూ మానస సరోవరాల్లా వరాలు పొందారు.
మునుల్లా తపస్సులో నిమగ్నమైన ఆడపిల్లల కన్నుల్లో ఐరావతాలు పారిజాతాలు తెల్లని గుర్రాలు మౌనంగా గగనమంతా విహరిస్తూ ఉంటే దేవకన్యలా మారిపోయారు.
అందమంతా ప్రోగుచేసీ బంగారు కుండల్లో పోస్తే చంద్రుల్లా కావడికుండలు మోసి అలసిపోయిన ఆకాశం నిమిషంలో మాయమై య్యిందీ.
అంటి అంటని మెరిసే పాదరసం నీకోసం పదునాలుగు లోకాలు దాటి పారింది.
ఎగిరే పక్షుల్లా ఏడు సముద్రాల్నీ దాటి చేపల్లా సముద్రాలన్నీ ఈదీ వీధి వీధి నీకోసం ఎదురు చూసింది.
తలుపు తెరిచి దర్శనమిచ్చుకో...!!?
రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని.
=========================================
డా ప్రతాప్ కౌటిళ్యా పాలెం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శ్రీ శ్రీ కళావేదిక గౌరవాధ్యక్షుడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి