ప్రకృతి హైకులు : - నామ వెంకటేశ్వర్లు
1.పచ్చని ప్రకృతి
వన్యజీవులకే
జీవదాతయే

2.మావి చిగురు
కోకిల కంఠానికి
తీయని విందు

3.చెరువు నిండి
పక్షిజాతులకది
గొప్ప విందు

4.చెరువు అలుగు
నీటి ప్రవాహానికి
స్వేచ్ఛా ద్వారం 

5.నక్క ఊళ్ళు      
ఆకలి తీర్చుకొని 
తృప్తి గీతమే 

6.మేఘ గర్జన
పిడుగుల రాకకు
ముందు హెచ్చరి    
                                                                   
7.ప్రేగుల  అరుపు 
ఆకలి బాధకై 
ఆర్తనాదమే

8.మగ్గము మోత
పద్మశాలీయుల
జీవన నాదం

9.సమ్మెట దెబ్బ
కమ్మరి చేతిలో
కర్తవ్యదీక్ష

10.ఉక్కపోతలు
రాబోయే వానకు
మేలి గుర్తు

11.భూ ప్రకంపనలు
సునామీ రాకకు
హెచ్చరికయే

12.తల్లిపాలు
పసిబిడ్డ దాహానికి
అమృతధార



కామెంట్‌లు