రోటరీ గ్లోబల్ ఛాంపియన్స్ క్లబ్బు ఆధ్వర్యంలో కార్యక్రమంహాజరైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్
రోటరీ క్లబ్ గ్లోబల్ ఛాంపియన్స్ సహకారంతో బోరబండలోని తెలంగాణ గురుకుల బాలుర కళాశాల పాఠశాలలో శుక్రవారం మొక్కల నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. రోటరీ క్లబ్ గ్లోబల్ ఛాంపియన్స్ గురుకుల పాఠశాలను దత్తత తీసుకోవడం అభినందనీయమని, అందులో భాగంగానే ఈ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.
రోటరీ క్లబ్ ప్రతినిధులు త్రీనాథ్ బాబు, శ్రీనివాస్ మాట్లాడుతూ గ్లోబల్ ఛాంపియన్స్ ఆధ్వర్యంలో మొత్తం 2,450 మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అయితే పాఠశాలలో మొక్కలకు అవసరమైన నీటి సదుపాయం పరిమితంగా ఉండటంతో ప్రస్తుతం 450 మొక్కలను మాత్రమే నాటినట్లు వెల్లడించారు.
పాఠశాల ప్రిన్సిపాల్ రమణమ్మ, ఉపాధ్యాయులు, మొలక స్పెషల్ కరస్పాండెంట్ KVM వెంకట్‌తో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో విద్యార్థులు, సిబ్బంది విశేషంగా కృషి చేశారు.
అనంతరం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ గురుకుల పాఠశాల ప్రాంగణంలో ఉన్న గ్లోబల్ ఛాంపియన్ క్లబ్ ద్వారా భోజనశాలను ఆధునిక హంగులతో త్వరలో మోడర్నైజేషన్ చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో
G. రమణమ్మ - ప్రిన్సిపల్
టీచర్స్
కె. రజని - ఏ.టి.పి
కె. వీరారెడ్డి - డిప్యూటీ వార్డెన్
వి. గోవర్ధన్ రెడ్డి
కె. దామోదర్
కె. రాజశేఖర్
జి. బాలకృష్ణ
కె. రాజేశ్వరి
ఎన్. సురేష్
ఎం. వసంత
సి. ఉమారాణి
కె. కళావతి
రాజేశ్వరి - ఎన్.ఓ
ఎం. ప్రవీణ్ కుమార్
కె. మాధవి
ఆయేషా
ఎన్. భరత్
సంగమేశ్వర్
కామేశ్వర రావు
జి. శ్రావంతి
ఆంజనేయులు
మహేష్ గౌడ్
ఎ. లత
సురేందర్
స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనంతయ్య, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి