లేత ఎండకు మెరిసిపోయే
చిన్ని పువ్వుల సోయగాలు
ఊగుతూ సంబరాన నవ్వే
చిట్టి హృదయ సంతోషాలు
ఆగిచూచే వారు లేరు
మెచ్చుకునే మాట లేదు
నచ్చినట్టు తెలియదు
సందడొక్కటే విరిసి పూయడం!
రంగులద్దిన రాజెవరో
రేకులిచ్చిన తల్లి ఎవరో
నిలువనిచ్చిన తీగ ఏదో
ఉన్నదొక్కటే చిన్ని జన్మ!
నిన్న లేదు రేపు లేదు
ఉన్న చోటు తెలియలేదు
వచ్చిన లోకం ఎరుగదు
తెలిసినదొక్కటే ఆనందం!
వెలుగు పెట్టిన చిట్టి ముద్దు
తలపై మెరిసే మణి కిరీటం
తోటి పువ్వుల వంక చూసి
గొప్పగా నవ్వే చిద్విలాసం!
సృష్టి లోని మర్మమంతా
కష్టపడకుండా తెలుసుకొని
కనిష్ఠ సమయంలోనే
గరిమగ కాలం గడిపే.....
గరిక పువ్వు శోభలకు
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి