నీవు, వెలుగులో, ఉన్నావు !నీకు ,నేను, తోడై, ఉన్నాను!నిన్ను ,ఎప్పుడూ, నేను ,వీడను!ప్రభాతాన ,అన్నగా, నీ వెంట!అస్తమయాన, తమ్ముడ్నంట!వెలుగు సహవాసం, జ్ఞానవర్ధనం!చీకటి మగ్గడం, అజ్ఞాన బంధనం!వెలుగునీడలు,నిత్యద్వంద్వాలు!జగతి ద్వంద్వాలమాయాజాలం!అధిగమిస్తే, అంతరాత్మ దర్శనం!పొగ నిప్పుకు, పూర్వాగమనం!నీడ వస్తువు, ఉనికి, నిదర్శనం!పడే నీడ, వెలుగుకి, ఆహ్వానం!నడిచే నీడ, చీకటిలో,విలీనం!వెరసి, నీడ, జీవన అర్ధ భాగం!చెట్టు నీడ, చెప్పే నిజం!కష్టాల ఎండలు ,భరించాలి!సుఖాల ఛాయ, విస్తరించాలి!కష్టాల ఫిర్యాదులు, మానాలి!సుఖాల మర్యాదల, జీవించాలి!__________

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి