డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రత్నలక్ష్మి కి మహతీ కవి భూషణ బిరుదు

 నంద్యాల నివాసియైన ప్రముఖ కవయిత్రి మరియు కడప జిల్లా జమ్మలమడుగులో గల గాలేరు నగరి సుజల స్రవంతిలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా ఉద్యోగ విధులు నిర్వహిస్తున్న ఎస్. రత్నలక్ష్మి మరొక పురస్కారాన్ని అందుకున్నారు. మహతి సాహితీ సంస్థ వారు తమ ఆరవ వార్షికోత్సవం సందర్భంగా 21/06/2026న హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన యోగ సంగమం కవి సమ్మేళనంలో ఆరోగ్య ప్రదాయిని యోగ శీర్షికతో రత్నలక్ష్మి పఠించిన కవిత అందరినీ రంజింప చేస్తూ హర్షధ్వానాలతో చప్పట్లవర్షం కురిపించి పలువురి ప్రశంసలను అందుకుంది. రత్నలక్ష్మి సాహిత్య ప్రస్థానంలో విశిష్ట ప్రతిభను కనబరుస్తూ సాహిత్య రంగానికి అమూల్యమైన సేవలు అందించినందుకు గాను ఉత్తమ సాహిత్యాభిరుచితో సృజనాత్మక రచనలు విరచిస్తూ సాహిత్యాభివృద్ధికి తోడ్పడుతున్న తనలోని అంకిత భావాన్ని గుర్తించి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ప్రముఖ కవి డాక్టర్ అడిగొప్పుల సదయ్య డాక్టర్ డీఎస్వి మహాలక్ష్మి సత్యం మాస్టారు జోషి మధుసూదన శర్మ నాయకంటి నరసింహ శర్మ అందమైన దుశ్శాలువతో సత్కరిస్తూ మహతి కవి భూషణ బిరుదు పురస్కారాన్ని ప్రధానం చేస్తూ విశిష్ట జ్ఞాపికతో బిరుదు పత్రంతో సన్మానించారు. ఇప్పటికే రత్నలక్ష్మి సాహిత్య రంగంలో మహోన్నత సాహితీ సంపదలు కలిగిన తన కవిత్వ రచనలతో ఎన్నో ప్రశంసలు, ప్రముఖులతో మరెన్నో సన్మానాలు, విశిష్టులతో లెక్కలేనన్ని అభినందనలు అందుకున్నారు. ఈ సందర్భంగా వారిని సాహితీ ప్రముఖులు, కవులు, కవయిత్రులు, బంధుమిత్రులు ప్రశంసిస్తూ అభినందించారు
కామెంట్‌లు