జన్మజన్మలో..!?;-డా ప్రతాప్ కౌటిళ్యా.


వేయి జన్మలెత్తిన 
కోటి జన్మలిచ్చిన 
భూగర్భంలో 

మహాసముద్రాలు నడయాడినవీ
మహా పర్వతాలు నిర్మించబడ్డాయి 
మహా రణ్యాలు నిలబడ్డవీ

వేయి జన్మలెత్తినా 
కోటి జన్మలిచ్చిన 
విశాల ఆకాశంలో 

ఖగోళాలు గోళాలు 
భూగోళాలు 
పుంతలు పాలపుంతలు 
నక్షత్రాలు నక్షత్ర మండలాలు 
పురుడుపోసుకున్నవి. 

వేయి జన్మలెత్తిన 
కోటి జన్మలిచ్చిన 
మనసులో మనిషిలో 

స్వర్గ నరకాలు 
సుఖదుఃఖాలు 
దేవాలయాలు 
విద్యాలయాలు 
మంచి చెడులు 
క్రూర మృగాలు 
కాలకూట విషాలు
అమృత బాండాలు 
ఆస్తులు అంతస్తులు 
పగలు రాత్రులు పుట్టాయి.

వేయి జన్మలెత్తిన 
కోటి జన్మలిచ్చిన 
మానవ జన్మలో 

ఆడ మగాలు 
దేహాలయాలు 
ఆలు మొగలు
అన్నా చెల్లెలు 
అన్నా తమ్ముళ్లు 
అమ్మానాన్నలు 
అవతారాలెత్తారు..!!?

జన్మజన్మలో 
ఒక బీకర యుద్ధమే జరిగింది. 

ఎర్రని రక్తం పారింది 
నీలాకాశం కరిగింది 
పచ్చని వృక్షం ఒరిగింది 
తెల్లని నీరు కురిసింది 
నల్లని మట్టి కరిగింది 
చల్లని గాలి వీచింది. 

జన్మజన్మలో 
ఒక బీకర యుద్ధమే జరిగింది. 

పక్షి ఎగిరింది 
చేప ఈదిందీ
గుర్రం పరిగెత్తింది 
చంద్రుని చేరింది. 

జన్మజన్మలో 
ఒక యుద్ధమే జరిగింది.!!?
============================================
డా ప్రతాప్ కౌటిళ్యా పాలెం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శ్రీ శ్రీ కళావేదిక గౌరవాధ్యక్షుడు.
8309529273.
కామెంట్‌లు