ఇగో...!!: -సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
నేను 
ఇగో ను  అన్నవారికి 
మరణాన్ని గురించి చెప్పండి. 

అప్పటికి కూడా లెక్కచేయకుండా 
ఈ భూగోళంపై 
మేమే మొనగాళ్ళం అన్నవారికి 
ఖగోళం గురించి చెప్పండి 
చచ్చి ఊరుకుంటారు....!!?

ఎవరి దగ్గర 
ఏదైతే లేదో 
అదే వారికి అందమైనది 
అత్యంత అద్భుతమైనది. 

ఎవరి దగ్గర 
ఏదైతే లేదో 
అదే వారికి స్వర్గం.!!
ఉన్నది నరకం.!!?

మనం ప్రేమలో ఉన్న 
ద్వేషం లో ఉన్న 
ప్రకృతి సహకరించనప్పుడు 
సహనం తప్ప 
సహకారం పనిచేయదు. 
ద్వేషం తప్ప- ప్రేమ పుట్టదు...!!?
==================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.

కామెంట్‌లు