కీర్తిరథుని పుత్రుడు దేవా మిఢుడు
అతని పుత్రుడు విబుధుడు
విబుధుని తనయుడు మహీధ్రకుడు
అతని పుత్రుడు కీర్తిరాతుడు
అతని పుత్రుడు మహా రోముడు
పరమ ధర్మాత్ముడైన అశ్వరోమమహారాజు
అతని కుమారులలో నేను పెద్దవాడను
నా తమ్ముడు కుశధ్వజుడు మహావీరుడు
అతనిని వాత్పల్యముతో చూసుకుంటిని
నా తండ్రి రాజ్యభారము నాపై మోపగా
కొంతకాలము గడచిన పిదప
సాకాస్యపురమునేలు రాజు సుధన్వుడు
మిథిలా నగరముపై దాడి చేసి
శ్రేష్టమైనశివధనస్సును నా బిడ్డ సీతాదేవిని
తనకు ఇవ్వుమని అడిగినాడు
నేను అతని కోరికను మన్నింపనందుకు
నాపై రణమునకు దిగి ఆసువులనొదిలెను
సాంకశ్య రాజ్యమును కుశధ్వజుడేలును
ఓ దశరథ నా ఇద్దరి బిడ్డలను
నీ ఇద్దరి పుత్రులకు నేను ఇస్తాను
వారిచే భూ, తిల, హిరణ్యది దానములను
బ్రాహ్మణులకు ఇప్పింపుమయ్యా

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి