జనకరాజు ఆదేశమును అనుసరించి
ఆ దూతలు మూడు దినములు పయనించి
అయోధ్య నగరమునకు చేరినారు
రాజ దూతలు దశరథుని దర్శించినారు
జనక మహారాజు పంపగా వచ్చాము రాజా
వారు తెచ్చిన శుభపత్రికను రాజుకిచ్చినారు
దశరథుడు శుభ పత్రికను చూసి
ఎంతో సంతోషించి క్షేమములడిగినాడు
శుభ పత్రికను దశరథుడు చదివాడు
ఓ మహారాజా నా కూతురు సీతను
మీ పుత్రుడు రామునికి ఇచ్చి వివాహము
చేయుటకు నిశ్చయించుకున్నాము
శివ ధనుస్సును రాముడు విరిసినాడు
నా కూతురు సీత మనసును గెలిచినాడు
వారి వివాహమునకు మీ అనుమతికై ప్రార్థన
మహారాజా శీఘ్రముగా విచ్చేయ ప్రార్థన
దశరథుడు వారి కుల గురువుకు తెలిపి
ముగ్గురి తల్లులకు కూడా తెలిపినాడు
పుర జనులకు కూడా తెలిపినాడు
ఆ రాత్రి అందరితో సంతోషంగా గడిపినాడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి