దశరథ మహారాజు సపరివారముగా మిథిలా నగరం చేరుట : - ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
దశరథుడు గురువులు బంధువులతో కూడి 
రత్నములను ,బంగారు ఆభరణములను 
పెండ్లి వేడుకకు కావలసిన వస్తువులనతో 
సర్వసన్నద్ధులై ఆనందంగున్నారు 

వశిష్టమహార్షిని బ్రహ్మ నూతములతో 
ముందు రథంన కూర్చొమ్మని తెలిపినాడు 
దశరథుడు తమ వారితో కూడి
నాలుగు దినములు ప్రయాణము చేసి 

మిథిలానగరమునకు చేరినారు
జనక మహారాజు దశరథునికి ఎదురెళ్లి 
దశరథునికి వందనముల మొనర్చి 
శుభకార్యములకు వచ్చి తెలిపారు 

సమస్త బ్రహ్మానోతములతో కూడి 
వశిష్ట మహర్షి విచ్చేయుట మా భాగ్యము 
రఘువంశుడవైన ఓ దశరథ మహారాజ 
మీరు ఇచ్చటికి వచ్చుట మా అదృష్టము. 

కన్యాదానమునకు ప్రతిబంధకములైన 
విజ్ఞములన్నియును తొలిగిపోయినవి 
పరాక్రమవంతులలో శ్రేష్టులైన
రఘువంశం వారితో బంధుత్వముతో


కామెంట్‌లు