మా ఖానాపూర్ బడిలో
సరస్వతి దేవి కొలువై ఉన్నది
ఆ దేవి నీడలో బుడతలేందరో
విద్యాబుద్ధులతో
బుద్ధులవుతున్నారు.
పచ్చని ప్రకృతి మా బడి.!!
మా బడికి
కోతి బిడ్డ వచ్చింది
కోతి పనులు చేసింది
కొత్త నీతి పాఠాలు నేర్చుకుంది.!
మా బడికి
చిలుక బిడ్డ వచ్చింది
చిలిపి పలుకులు పలికింది.
కొత్త పదాలు నేర్చుకుంది.!!
మా బడికి
కోయిల వచ్చింది
పాటలు పాడింది
మాతో కలిసి కొత్త పాఠాలు నేర్చుకుంది.!!!
మా బడికి
నెమలి వచ్చింది
మాతో కలిసి నాట్యం చేసింది.
పాఠాలెన్నో నేర్చింది.!!!
====================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి