వికారాబాద్ జిల్లా తాండూరులోని విలేమున్ గ్రౌండ్‌లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన యోగ విన్యాసాలను ఎమ్మెల్యే ఆసక్తిగా వీక్షించి వారిని అభినందించారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని ఆయన సూచించారు.
కార్యక్రమంలో పతంజలి యోగ ప్రతినిధులు వివిధ యోగాసనాలను చక్కగా ప్రదర్శించి యోగా ప్రాముఖ్యతను వివరించారు. పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు, విద్యార్థులు పాల్గొని యోగాసనాలు చేశారు.
ఈ కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, పతంజలి యోగ నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. యోగా దినోత్సవ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి