పర్సెప్షన్: - డా ప్రతాప్ కౌటిళ్యా.
మూమెంట్ -టైం- కేవలం 
సైకలాజికల్ -పర్సెప్షన్ -మాత్రమే.!?

కాంతి లేదు 
చీకటి లేదు 
కదలిక లేదు 
కాలము లేదు 
దూరము లేదు. 
వేగము లేదు 
మనిషి మానసిక అనుభూతి అది.!!

ముందు వెనక 
పైకి కిందికి 
కుడి ఎడమ 
స్ట్రైట్ గా గజిబిజిగా 
ఏదీ లేదు 
అంతా 11 డైమెన్షన్ల 
గందరగోళం.!!?

మానవ ఊహ 
మనిషి మానసిక అనుభూతి 
పర్సెప్షన్ తప్ప 

ఉన్నది ఉన్నచోటనే ఉంది 
ఉన్నది లేనిది కూడా 
ఉంది లేదు 

మనం ఉన్నచోటనే ఉన్నాం 
అది ఉన్నచోటనే ఉంది 
ఉనికి వైశాల్యం శూన్యం కూడా ఉంది 

విశాల వాక్యూమ్ లో 
ఉనికి ఒక ఊహ 
కేవలం 
మనిషి పర్సెప్షన్లోనే
పదార్థం శూన్యం శక్తి 
అర్థం దాగుంది.!!!!!.
========================================
డా ప్రతాప్ కౌటిళ్యా పాలెం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శ్రీ శ్రీ కళావేదిక గౌరవాధ్యక్షుడు.

కామెంట్‌లు