పుత్రా! పిత్రార్జితంఏదీ? కాస్తా అగు చెప్తా: - . డా.సి వసుంధర,చెన్నై
ఆస్తుల కోసం సిగ 
పట్లు
అమ్మా  నాన్నలు
 ఇంట్లో వద్దు

అడిగిన వారిని
           కడిగేసేయ్
మీ కక్కర లేదని
        వారి నోరు నొక్కేసేయ్.
   చిక్కినదంతా
దోచేసేయ్
     దొరలా ,
దోరమాగిన
పండులా, బతికేసేయ్.
కాదనను.

కానీ,
రాముని మాటెత్తకు.నీ కామపు జన్మకు
అది సరికాదు.
నిగమ శర్మ అయితే
నీకు సూటవుతాడు.
  అతదేవరో
 నీ వెరుగవు గదా.
సినిమా జ్ఞానం బహుళం గదా.
పాండురంగమహాత్మ్యం.లో  N. T. R.ఓ కె నా?

పిల్లికి బిచ్చం పెట్టనివాడు
తల్లికి పిండం పెట్టనివాడు

స్టేజిలెక్కి మైకులు పట్టీ
 అందరి బుర్రలమీద  
నీతుల సూదులతో
పొడవడానికి ఫుల్స్టాప్ పెట్టాలి.
    నీ పని చూసుకో
నాయనా!
అందరి పని ఎందుకు
చెడగొడతావు.
   ఏ ఎండకు ఆ గొడుగు.
ఎంత రేటుకు
అంత పాదాభి వందనం.
 కొంతలో కొంత తస్కరణ
ఇత్యాదులు కలియుగ
ధర్మాలు. కాదనను.
కానీ,
ఇవన్నీ చేసే నీకు
పూలన్ని వెస్ట్ చేసి
కాలాన్ని వృధా చేసి
దేవుణ్ణి కదలనీక
పూజంచడం అవసరమంటావా!ఆలోచించు.

@,ఆఆస్తి అంటే అమ్మానాన్న సంపాదించింది కాదు నీవు సంపాదించు జ్ఞాన సంపద.
నీ హృదయం సత్కళా
సంపదకు
నిలయం చేసుకో.పంచు పదిమందికి
ఆ సంపద దాచుకోకు.
 మాతృదేశానికి, భాషకు ఒక భూషణంగా  నిలవాలి నువ్వు.🦜

కామెంట్‌లు