తారు రోడ్డు ; - జంపాల మీనయ్య


నల్ల నాగు 
తారు రోడ్డు మీద 
నా నడక చూడంగ 
నాట్యమాయె నాకు 
ఎండ వేడికి 

వొంపు సొంపు కలిగి 
ఊరించు వయ్యారి 
వలువదాయె నన్ను 
ఎండ వేడికి 

నిర్ధయను కలిగి 
నెట్టి వేసె నన్ను 
చెట్టు నీడ నే చేరంగ 
వేడెక్కి తాను ఒంటరాయె 
ఎండ వేడికి 

ఉదయ సాయములందు ఉరకలెత్తు జనులు 
కన్నెత్తి చూడరైరి మద్యాన్నమందనుచు 
వేడెక్కి తాను ఒంటరాయె 
ఎండ వేడికి 

ఒంటి సెగలు చూడ 
నీటి అలల జాడ 
దరికి చేరు వేల 
ఎండమావులాయె 
ఎండ వేడికి 

క్షణము కూడ తనను 
చూడకుండని నన్ను 
కదలకుండగ జేసి 
వేడెక్కి తాను ఒంటరాయె 
ఎండ వేడికి 

తొలకరుడుగ నేను పలుకరించు వేల 
పడుచు దనము పొంది 
వదిలి వేసెనే 
ఆగడు నెగడు లన్ని 


 
కామెంట్‌లు