వైభవ్ సూర్యవంశి కోసం మారిన నిబంధనలు: - - యామిజాల జగదీశ్
 తల్లి, తండ్రి పక్కన ఉండగా తొలిసారి అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సూర్యవంశీ సిద్ధమవుతున్నాడు.
ఇటీవల ముగిసిన ఐపీఎల్ టీ - 20 సిరీస్‌లో తన సత్తా చాటిన, 'బేబీ యూనివర్సల్ బాస్'గా పేరుగాంచిన వైభవ్ సూర్యవంశీ, ఐర్లాండ్ - ఇంగ్లాండ్ సిరీస్‌ల కోసం భారత టీ20 జట్టులోను, ఆసియా క్రీడల జట్టులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.
సాధారణంగా, క్రికెట్ సిరీస్‌లు లేదా విదేశీ పర్యటనల సమయంలో ఆటగాళ్లతో పాటు వారి భార్యలు లేదా కుటుంబ సభ్యులు వెళ్లవచ్చు, కదా? కానీ, దీని కోసం క్రికెట్ బోర్డు కొన్ని కఠినమైన నిబంధనలను విధించింది.
అయితే, ఇప్పుడు ఈ యువ ఆటగాడి కోసం ఆ నిబంధనలు సవరించారు.
సాధారణ నిబంధన :
సుదీర్ఘ సిరీస్‌లు లేదా విదేశీ పర్యటనల సమయంలో ఆటగాళ్ల కుటుంబ సభ్యులు, భార్యలు వారితో ఎక్కువ కాలం ఉండకుండా నిరోధించడానికి బీసీసీఐ గతంలో కఠినమైన నిబంధనలను అమలు చేసింది. 45 రోజులకు పైగా సాగే సిరీస్‌లలో, ఆటగాళ్లతో పాటు కుటుంబ సభ్యులను కేవలం 14 రోజులు మాత్రమే ఉండేందుకు అనుమతించారు.
ప్రత్యేక అనుమతి :
చాలా చిన్న వయసులోనే ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ ఒంటరితనాన్ని అనుభవించకుండా ఉండేందుకు, అతని విదేశీ పర్యటనల సమయంలో అతనితో పాటు ప్రయాణించే తల్లిదండ్రుల ఖర్చులన్నింటినీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భరించాలని నిర్ణయించి ఆ మేరకు నిబంధనలను సవరించింది.

కామెంట్‌లు