కనకాంబరాల కమల:- డా.కందేపి రాణీప్రసాద్


 హలో పిల్లలూ!  కనకాంబరాలు, బంతులు, పీస్‌ లిల్లీలు, గుల్ మోహర్లు, నూరు వరహాలు, కొబ్బరి పిందెలు, చింత గింజలు చాలా చెట్లకు సంబంధించిన పూలు, కాయలు, పూల మధ్యలో కేసరాలు వాడాను. దీనితో పాటుగా మంచినీళ్ళు తెచ్చుకునే వాటర్ బబుల్స్ మూతలు కూడా వాడాను. మేం బెంగుళూరులో ఉన్నప్పుడు ఇంటికి వాటర్ క్యాన్స్ వచ్చేవి. వాటి మూతలు, మూతల క్రింద ఉండే రింగులు దాచేదాన్ని. వాటితో బొమ్మలు చేయాలనుకున్నాను. ఒక రోజు కనకాంబరాల అమ్మాయిని చేయాలనుకున్నప్పుడు ఈ మూతలు, రింగులు కన్పించాయి. ముఖం, శరీరం రింగులతోనే చేశాను. కనకాంబరాలు అకాంథేసి కుటుంబానికి చెందిన మొక్క ‘‘ క్రోసాండ్రా ఇన్‌ఫండి బ్యొలి ఫార్మిస్’’ అనేది కనకాంబరాల శాస్త్రీయ నామం. ఇది శ్రీలంక దేశానికి చెందిన మొక్క. పువ్వులు పగడాల్లా ఒక గుత్తిలా కాస్తాయి. ఒక్కొక్క గుత్తిలో పది పన్నెండు పువ్వులు ఉంటాయి. ఉష్ణ మండల ప్రాంతాలలో పెరుగుతుంది. ఇవి ఎరుపు, పసుపు, నారింజ, నేరేడు వర్ణాలలో లభిస్తాయి. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు కనకాంబరాలు కాస్తాయి. ఇళ్ళల్లో ఎక్కువగా పెంచుతారు. హెర్భల్ వైద్య విధానంలో దగ్గు, అల్సర్ వంటి వైద్య చికిత్సలకు వాడతారు.
ముఖం లాగా రింగులను గుండ్రంగా అమర్చి దానిలో బంతి పూలను పెట్టాను. మరికొన్ని రింగులను పావడా వలె అమర్చాను. వీటిలో గుల్ మోహర్ పూలు పెట్టాను. పావడా క్రింది వైపు క్యాన్ల మూతలు పెట్టాను.ఇప్పుడు రెండు రింగులను చేతులుగా వాడుకున్నాను. ఎండు పుల్లల్ని చేతులుగా పెట్టాను. కనుబొమ్మలుగా పీస్ లిల్లీ కేసరాలు పెట్టి, కళ్ళుగా చింతగింజల్ని పెట్టుకున్నాను. పెదవులుగా కొబ్బరి పిందెల తొక్కల్ని పెట్టాను. పావడా మొత్తాన్ని కనకాంబరాలు, గుల్ మోహర్లు, కొబ్బరి పిందెలు చల్లాను. తలలో పెద్ద కనకాంబర మాలను పెట్టాను. చెవులకు లోలాకులు పెట్టాను.
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం