మరసటి రోజు తెల్లవారుజామున
విశ్వామిత్రుని రామలక్ష్మణులను
ఆప్యాయతతో పిలిచి జనకుడు
విశ్వామిత్రుని రామలక్ష్మణులను పూజించాడు
బ్రహ్మర్షి నీకు స్వాగతం నేనేమి చేయాలి
మీ ఆజ్ఞనుసారము నేను చేస్తాను
వీరు దశరథమహారాజు పుత్రులు
వీరు శివధనస్సును చూడ కోరుచున్నారు
ముని పలుకులు విన్న జనకుడు
మహర్షితో ఇలా విన్నవించుకుంటాడు
ఈ విల్లు గూర్చి తెలుపెద వినుడు
విమి వంశఅరచక్రవర్తైయిన దేవర తునికి
ఆ పరమశివుడు ఈ ధనస్సునిచ్చినాడు
దక్షయజ్ఞమును ధ్వంసమొనర్చువేల
శివుడు ఈ ధనస్సును ఎక్కుపెట్టి
కోపముతో దేవతలను ఇలా అంటాడు
ఓ దేవతలారా హవిర్భాగములను
మీ ద్వారా నేను కోరుచున్నాను
వాటిని మీరు సమకూర్చ నందుకు
మీ తలలను ఈ ధనస్సుతో ఖండించెద

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి