వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాలల జూన్ మాస పత్రిక "మొలక" పుస్తకాన్ని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులలో నైతిక విలువల పెంపునకు కథలు, కవితలు, సామెతలతో పాటు నిత్య సత్యాలను పరిచయం చేసేలా బాలల మాసపత్రికను నడుపుతున్న వేదాంత సూరి గారిని అభినందించారు. అలాగే తాండూరు ప్రాంతంలో ఈ పత్రిక విస్తరణకు ఎంతో కృషి చేస్తున్న వెంకట్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు.
అనంతరం యాలాల మండల విద్యాధికారి (ఎంఈవో) మహిపాల్ రెడ్డిని ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. యాలాల మండలంలో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ మరియు టాలెంట్ టెస్ట్-2026 కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు గుర్తింపుగా.. మహిపాల్ రెడ్డికి శాలువా కప్పి, మెమెంటో అందజేసి అభినందించారు.
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు సమన్వయం ముఖ్యం:
"విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడంలో, విద్యా ప్రమాణాల పెంపులో ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలి. 'మొలక' లాంటి మాస పత్రికలు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఇలాంటి సృజనాత్మక పత్రికలను ప్రోత్సహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, డాక్టర్ అనీల్ కుమార్, మండల పిఆర్టియు అధ్యక్షుడు కృష్ణారెడ్డి, నర్సిరెడ్డి, మహేష్ కుమార్, వెంకటయ్య, వినయ్ కుమార్, యూనుస్ తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి