డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం విద్యార్థులతో గవర్నర్, సీఎం ప్రతిజ్ఞ: వెంకట్ , మొలక ప్రతినిధి

 హైదరాబాద్: మాదక ద్రవ్యాల నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ శర్మ విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు తదితర ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
“డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ, మాదక ద్రవ్యాల వ్యసనానికి దూరంగా ఉండి, ఇతరులను కూడా చైతన్యపరుస్తూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తాం” అని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.
తెలంగాణను మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషించాలని నాయకులు పిలుపునిచ్చారు.
కామెంట్‌లు