చేతిరాత పోటీలో విద్యార్థుల ప్రతిభ

 హైదరాబాద్ కు చెందిన ఆస్క్ ఎడ్యుకేషనల్ సొసైటీ గత నవంబరు మాసంలో పాఠశాల విద్యార్థులకు జాతీయస్థాయిలో నిర్వహించిన చేతిరాత పోటీలో మండలంలోని ఆయుధ కర్మాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనపరిచారు. ఏడవ తరగతికి చెందిన హుప్లే భవాని, ఆరవ తరగతికి చెందిన మల్లగల్ల హయతి, ఏడవ తరగతికి చెందిన కుమ్మరి విష్ణువర్ధన్ పాఠశాల ఛాంపియన్లుగా పతకాలు ,ప్రశంసా పత్రాలు పొందినట్లు గైడ్ ఉపాధ్యాయుడు అడ్డాడ శ్రీనివాసరావు తెలిపారు. వీరికి పాఠశాలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయురాలు రజిత చేతుల మీదుగా పతకాలు ,ప్రశంసా పత్రాలు అందజేశారు. చేతిరాత పోటీలో పాల్గొన్న మిగతా 25 మంది విద్యార్థులకు కూడా ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయభాస్కర్, రవీందర్, చవాన్ సుభాన్ సింగ్, సంధ్య, సలోమి పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థుల్ని తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు అభినందించారు.
కామెంట్‌లు