బ్రహ్మ విశ్వామిత్రుని కడకు వెళ్లి
ఓ బ్రహ్మర్షి నీ తపస్సు మెచ్చితిమి
నీ తీవ్రమైన తపఃఫలముగాంచి
బ్రహ్మత్వమును పొందితివి ఓ బ్రహ్మర్షి
ఈ దేవతల పక్షమున దీర్ఘాయుడవు నీవు
ఓ సౌమ్యుడా హాయిగా వెళ్లి రమ్ము
పితామహుని ఆశీస్సులు అందుకొని
బ్రహ్మాదిదేవతలకు నమస్కరించినాడు
ఓ పితామహా మీ అనుగ్రహం వలన
బ్రహ్మాత్వమును, దీర్ఘాయువు లభించినది
యజ్ఞములను చేయించు అర్హత
వేదములను బోధించే అర్హత
విశ్వామిత్రునికి కల్పించమని కోరుతాడు
అప్పుడు బ్రహ్మా దేవతలు వశిష్ఠుడు
అతడు కోరిన ప్రకారముగా వరములిస్తారు
విశ్వామిత్రుడు యజ్ఞయాగాలు చేపిస్తూ
శిష్యులకు వేదాలను నేర్పిస్తుంటాడు
విశ్వామిత్రుడు ఉత్తమమైన బ్రహ్మహర్షిగా
వశిష్టుని కొలిచి అతనిచే వరములొందును
ఆశ్చర్యకరమైన మీ కథను వింటిమయ్యా
శ్రేష్టుడవైనా ఓ మహాతేజస్వి నీకు వందనం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి