జీడి పప్పుల జీవిత: - డా. కందేపి రాణీప్రసాద్
హలో పిల్లలూ!  జీడి పప్పులంటే చాలా ఇష్టంగా తింటారు. కదూ! పాయసంలో, స్వీటల్లలో జీడి పప్పు తగలకపోతే ఎంతో వెలితిగా ఉంటుంది. రుచే రాదు. ఇప్పుడు జీడి పప్పు గురించి తెలుసుకుందామా! జీడి పప్పు ఉష్ణ మండల ప్రాంతాలలో ఉండే జీడి మామిడి చెట్టుకు కాస్తాయి. ఇవి సతత హరిత వృక్షాలు. వేట పాలెం, పలాస ప్రాంతాలలో జీడి పప్పు బాగా పండుతాయి. దీని శాస్త్రీయ నామం ‘‘ అనకార్టియం ఆక్సిడెంటల్’’. ఇది బ్రెజిల్‌కు చెందిన చెట్టు అయినప్పటికీ భారతదేశంలో విస్తారంగా పెరుగుతుంది.  జీడి మామిడి పండ్లు రసంతో చాలా బాగుంటాయి. ఈ పండు చివరన జీడి గింజలు ఉంటాయి.  ఈ గింజల్ని వలిచి జీడి పప్పును తయారు చేస్తారు. గోవాలో జీడి పండ్లతో ‘‘ఫెని’’ అనే ఘాలైన పానీయాన్ని తయారు చేస్తారు.  జీడి కాయలు పియర్ ఆకారంలో ఉంటాయి.  జీడి పండ్లను ‘‘జీడి ఆపిల్’’ అని కూడా అంటారు.  జీడి పప్పు కాయల పెంకు కింద ఉంటుంది. పెంకును కాల్చి తీసేశాక జీడి పప్పు లభిస్తుంది.  జీడి పెంకులు విష పూరితం. ఈ చెట్లు 14 మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతాయి. ఇది అనకార్టియేసి కుటుంబానికి చెందిన చెట్టు. ఇందులో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. 
నేనీరోజు జీడిపప్పుతో అమ్మాయిని తయారు చేశాను. ఈ పిల్లను బడికి పోతున్నట్లుగా సృష్టించాను. ఈ పీపను మొత్తంగా జీడి ప్పుతోనే తయారు చేశాను. జడలకు పూలు పెట్టాలి కదా అని గులాబీ రేకుల్ని ఉపయోగించాను. నేరేడు పళ్ళలాంటి కళ్ళు అని కవులు వర్ణిస్తారు కదా!. అందుకే నేరేడు పండ్లను కళ్ళుగా వాడాను.  రెడ్ బెర్రీస్‌తో పాపకు నెక్లెస్ పెట్టాను. ఎందుకంటే  ఖరీదైన పాపకు ఖరీదైన నెక్లెస్ చేయించాలి కదా! ఇంకా జుట్టుకు కూడా నేరేడు పండ్లను అలంకరించాను. మరి పాప బాగుందా! ప్లీజ్ తీసేయకండి. 

కామెంట్‌లు