సుప్రభాత కవిత : - బృంద
ఉదయ కిరణ రేఖలలో 
ఉత్సాహపు వెల్లువలో 
ఊయలూగుతూ  హాయిగా 
ఊరేగే మేఘమాల వయ్యారం....

నింగి నీలపు రంగును 
నింపుకున్న సెలయేరు
నిగనిగల మెరుపుతో 
నిలిచి చూచే నీరదాల పరుగులు!

సరిహద్దున కాపలా కాస్తూ 
సరిపోద్దున వెలుగుల ధారలో 
సరిగంగ స్నానాలు చేయు 
సమోన్నత  శిఖరాల గాంభీర్యం..

పచ్చని లోయల మధ్యన 
ప్రవహించే జలధారకు 
పచ్చని చీర చుట్టాలని 
పచ్చికకు కలిగిన ముచ్చట్లు!

పరవశాన ఊగుతున్న 
పంటచేల సిరి  సొగసులు 
పలకరించు  కిరణాలకు 
పలికె స్వాగత గీతాలు!

పులకరించిన నేలతల్లి 
పురివిప్పిన నెమలి కాగా..
పసిపాప నవ్వులా స్వచ్ఛంగా 
ప్రకాశించు పృథ్వి కి 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు