హలో పిల్లలూ! పారిజాతం చెట్లను, పువ్వులను చూసే ఉంటారు. కదా! అమ్మతో గడికి వెళ్ళినప్పుడుడ కనిపిస్తుంటాయి. శివుడికి చాలా ఇష్టమైన పూలు. తెల్లని రెక్కలతో, పొట్టిగా సింధూర కాండంతో ఉండే పారిజాతం పూలు అందంగా ఉంటాయి. ఇవి రాత్రి పూట పూస్తాయి. ఉదయానికే రాలిపోతాయి. చెట్టుక్రింద తెల్లని నక్షత్రాలు రాలినట్లుగా కనిపిస్తాయి. ఇంతకీ మనకు పువ్వులు కాదు కావాల్సింది ఆకులు. ఇవి ఓలియేసి కుటుంబానికి చెందిన మొక్కలు. నేను మా ఇంటిలో రెండు చెట్లు పెట్టుకున్నాను. పువ్వులతో కూడా చాలా బొమ్మలు చేశాను.గానీ ఈ రోజు ఆకులతో అందమైన పాపను చేద్దామనుకున్నాను. ఈ విత్తనాలతో కూడా చాలా బొమ్మలు చేశాను.ఆకులు కొద్దిగా తమలపాకు ఆకారంలో ఉంటాయి. నాకు లేత ఆకులు కూడా కనిపించాయి. దీని శాస్త్రీయ నామం ‘‘నిక్టాంథిస్ ఆరోబర్ ట్రిస్టిస్’’. పారిజాతం గురించి పురాణాలలో ఎన్నో కథలున్నాయి. నంది తిమ్మన రాసిన ‘‘పారిజాతాపహరణం’’ కావ్యం డా గుర్తొచ్చింది కదా!.
పారిజాతం చెట్టు ఆకులతో తల, శరీరం పెట్టాను. చేతుల కోసం ఆకులు కోసేసిన రెమ్మలు, తీగలు పెట్టాను. ముక్కు కోసం కనకాంబరం పువ్వును పెట్టాను. కళ్ళకు కళ్ళజోడు పెట్టుకున్నట్లుగా లేత రావి ఆకుల్ని పెట్టాను. నోటి కోసం కూడా లేత రావి ఆకును వాడాను. మా గోడలో రావి చెట్లు మొలిచి భయపెడుతుంటాయి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి