సముద్రంలో ఓ పడవ పోతోంది.
ఆ పడవలో ప్రయాణికులు చాలా మందే ఉన్నారు. వారిలో ఓ భక్తుడు. సముద్రం మధ్యలోకి వచ్చేసరికి హోరు గాలి మొదలైంది. క్షణక్షణానికి అది పెద్దదవుతోంది. పడవ పరిస్థితి చిక్కుసమస్యగా మారింది. ఒడ్డుకు చేరుకోగలమా అని అందరిలోనూ దిగులూ. భయమూ. పడవను నియంత్రించడం కష్టతరంగా మారింది. పడవ దిశ మారింది. ఎక్కడైనా బండకు డీ కొని పడవ మునిగిపోతుందేమోనని భయం భయం. అయితే భక్తుడు కళ్ళు మూసుకున్నాడు. దేవుడిని ప్రార్థించాడు.
దేవుడా, నన్ను ఎలాగైనా కాపాడు. నేను ప్రాణంతో బయటపడి ఊరుకి చేరుకుంటే నాకు సొంతమైన కోటి రూపాలు ఖరీదు చేసే ఇంటిని నీకు రాసిస్తాను అని వేడుకున్నాడు.
అతని ప్రార్థన ఫలించింది.
హోరు గాలి ఆగింది.
పడన పదిలంగా తీరం చేరింది.
ఒడ్డెక్కిన భక్తుడు ఆలోచించాడు.
పడవలో నాతోపాటు చాలా మంది ప్రయాణం చేసారు. వాళ్ళు కూడా సురక్షితంగానే తీరం చేరారు. నేను తొదరపడ్డానేమో...భగవంతుడికి హామీ ఇవ్వకుండా ఉండాల్సింది అనుకున్నాడు భక్తుడు.
అతని ఆలోచన ఇంకా ఇలా కొనసాగింది.
ఏదేమైనా దేవుడికి ఇత్తిన మాటను వెనక్కు తీసుకోవడానికి వీల్లేదు.
ఒకసారి దేవుడికి మాట ఇస్తే దాన్నినెరవేర్చకతప్పదు. అదే అసలైన భక్తుడి బాధ్యత. ఏం చేద్దాం అని ఆలోచించాడు.
చివరికి అతను ఓ నిర్ణయానికి వచ్చాడు.
దేవుడికి తాను ఇస్తాననుకున్న భవనాన్ని వేలం వేసాడు.
వేలానికి చాలా మంది వచ్చారు.
అతను చెప్పాడు. ఈ భవనం ఖరీదు రూపాయి మాత్రమే. ఈ ఇంటి స్తంభానికి కట్టిన పిల్లి వెల కోటి రూపాయలు. రెండూ కలిపే ఎవరైనా వేలం పాటలో పాల్గొనాలి, అంతేతప్ప ఇంటిని మాత్రమే కొనడం కుదరదు అన్నాడు భక్తుడు.
వేలం ప్రారంభమైంది.
ఒకరు వేలంపాటలో నెగ్గాడు. డబ్బులు వచ్చాయి.
భక్తుడు గుడికి వెళ్లాడు.
దేవుడా, నీకు మాట ఇచ్చినట్టే ఇంటిని వేలం వేశాను. ఇంటికి సంబంధించిన ధర ఇదిగో ఈ రూపాయి హుండీలో వేస్తున్నాను అని నమస్కరించాడు. అనంతరం అక్కడి నుంచి దర్జాగా బయటకు వచ్చాడు.
మిత్రులారా, కాస్త ఆలోచించండి.
ఈరోజుల్లో భక్తి, దేవుడు అనే మాటలు వ్యాపారమైపోయాయి.
-

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి