మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు రాసిన " మహబూబ్ నగర్ జిల్లా బడిపిల్లల కథలు " కథల సంకలనాన్ని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆవిష్కరించారు. సోమవారం కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు రాసిన కథలు చాలా చక్కగా ఉన్నాయని ప్రశంసించారు. విద్యార్థుల్లో సృజనాత్మక నైపుణ్యాలను ఆవిష్కరించడానికి ఇలాంటి రచనలు దోహదపడుతాయన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి విజయకుమారి మాట్లాడుతూ పాఠశాల విద్యార్థుల అనుభవాలు, ఆలోచనలతో ఈ పుస్తకం రూపుదిద్దుకుందన్నారు. చిన్నారుల్లో పఠనాసక్తిని పెంపొందించడానికి ఈ కథలు ఉపయోగపడుతాయన్నారు. జిల్లాలోని ఉపాధ్యాయులందరూ విద్యార్థులను ప్రోత్సహిస్తే వారిలో ఉన్న నైపుణ్యాలను వెలుగులోకి వస్తాయన్నారు. జిల్లా కలెక్టర్ సహాయ సహకారాలతో ఈ పుస్తకం వెలుగు చూసిందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ హరిప్రియ, జెడ్పీ సి.ఇ.ఓ. వెంకట్ రెడ్డి, ఎ.ఓ.సువర్ణ రాజ్, వ్యవసాయ శాఖ ట్రేనింగ్ సెంటర్ డి.డి. వేంకటేశ్ ఎ.ఎం.ఓ. దుంకుడు శ్రీనివాస్, సి.ఎం.ఓ. సుధాకర్ రెడ్డి, జి.సి.డి.ఓ. అస్రాఖాద్రి, పుస్తక సంపాదకులు డా.భీంపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
"మహబూబ్ నగర్ జిల్లా బడిపిల్లల కథలు" ఆవిష్కరణ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి