మనిషి మెదడు ఆకారంలో ఉండే పండ్లను చూశారా! వీటిని ‘వాల్‌నట్‌లు’ అంటారు. వీటిని తెలుగులో అక్రోట్ కాయలు లేదా కొండ గొనుగు పిక్కలు అని అంటారు. ఈ మధ్య చాలా మంది డ్రైఫ్రూట్లను తినడం మొదలు పెట్టారు.ఒకప్పుడు ధనికుల ఇళ్ళల్లో కనిపించే ‘వాల్‌నట్’లు, ‘అంజీర్’, ‘బెర్రీలు’ వంటీవన్నీ ఈనాడు మధ్యతరగతి వాకిట్లోకి చేరాయి. నేనీరోజు ‘వాల్‌నట్ల’ గురించి వివరించబోతున్నాను. గతేడాది కాశ్మీర్ వెళ్ళినప్పుడు అక్కడ ఈ చెట్లను చూశాను. ఎప్పుడూ డ్రై ఫ్రూట్‌గా మాత్రమే చూ వాను కానీ చెట్లను చూసేసరికి ఆనందంగా అనిపించింది. ఆ చెట్టు కింద నిలబడి ఫోటో తీసుకున్నాను. అందుకే నా కాశ్మీర్ యాత్రలో వాల్‌నట్ల చెట్లు కూడా భాగమయ్యాయి.
అక్రోట్ కాయ
శాస్త్రీయ నామం ‘‘ జుగ్లాన్స్ రెజియా’’. ఇది జుగ్లాండేసి కుటుంబానికి చెందిన మొక్క. ఈ చెట్టె యొక్క కాయలు తినడమే కాదు. ఈ చెట్టు కలప కూడా ఉపయోగపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇవి సాగు చేయబడుతున్నాయి. ఈ గింజలు మనిషి మెదడుకు సంబంధించిన ఆహారం మరియు మెదడు ఆకారాన్ని పోలి ఉంటుంది. కాబట్టి దీనిని ‘బ్రెయిన్ ఫుడ్’ అని అంటారు. ఇవి గుండె ఆరోగ్యానికి, మెదడు పని తీరుకు, మధుమేహ నియంత్రణకు ఉపయోగపడతాయి.
వాల్‌నట్లను ‘‘ఇంపిరియల్స్ నట్స్’’ అని పిలుస్తారు. వీటిలో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ చెట్టు గింజలు ఆకులు, బెరడు కూడా సాంప్రదాయ వైద్యాలలో ఉపయోగిస్తారు. చర్మ వ్యాధులు, జీర్ణ సమస్యలు ఇన్ఫెక్షన్లు తగ్గుతాయని భావిస్తారు.
జుగ్లాన్స్ రెజియా అనే ఈ చెట్టు 40 నుండి 80 అడుగుల వరకు పెరుగుతుంది. దీని మాను 2 మీటర్ల వ్యాసార్ధం కటిగి ఉంటుంది. కాయలు కాయడావనికి నాలుగైదు సంవత్సరాల కాలం పడుతుంది. దీనికి చెట్టు మాను ఎత్తు కన్నా చెట్టు పైన కొమ్మల కిరీటం ఎక్కువ స్థలం ఆక్రమిస్తుంది. ఇది ఆకురాల్చే చెట్టు. చెట్టు బెరడు నున్నగా ఆలివ్ బ్రౌన్ రంగులో ఉంటుంది. చెట్టు వయస్సు తక్కువగా ఉన్నప్పుడు మెడి బూడిద రంగుల మిశ్రమంగా కనిపిస్తుంది. ఆకులు 20 నుండి 45 సెం.మీ పొడవుతో ఒకటి విడిచి ఒకటి క్రమంలో అమరి ఉంటాయి. పువ్వులు గుత్తులుగా ఉంటాయి. ఇందులోనే ఆడ పువ్వులు, మగ పువ్వులు ఉంటాయి. ఈ పువ్వులు ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. కాయలు చిన్నగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. పండిన తర్వాత గోధుమ వర్ణానికి మారతాయి. కాయ పగిలి లోపల విత్తనం ఉంటుంది. విత్తనం లోపల రెండు మెదడు ఆకారపు అర్ధ గోళాలు వాల్‌నట్లు ఉంటాయి. చాలా చోట్ల ఈ చెట్లు పెరిగినప్పటికీ భారతీయ కాశ్మీరీ వాల్‌నట్లు మేలైనవి, నాణ్యమైనవని భావిస్తారు.
కాశ్మీరీ కొండల్లో, లోయల్లో కారు ప్రయాణీస్తున్నప్పుడు రోడ్డుకిరువైపులా పచ్చదనంతో మెరుస్తూ చెట్లు కనిపిస్తున్నాయి. ఇవి ‘వాల్‌నట్లు’ అని క్యాబ్ డ్రైవర్ చెప్పగానే నేను కారు ఆపి ఆ చెట్టు వద్దకు పరుగెత్తాను. ఆకులు ఆకుపచ్చగా ఉన్నా కూడా మెరుస్తున్నట్లుగా కనిపించాయి. రంగులు వేసేటప్పుడు మెటాలిక్ గ్రీన్ అంటాం. అలా అనిపించింది. చెట్టు పట్టుకుని రెండు కాయలు కోసుకున్నాను. ఫోటో తీసుకున్నాను. అలాగే చినార్, విల్లో చాలా చెట్ల వద్ద ఫోటోలు దిగాను.
వాల్‌నట్లను ‘పోషకాల గని’ అంటారు. ఇంకా వీటిని ‘సూపర్ ఫుడ్స్’ అని కూడా అంటారు. దీనిని సంస్కృతంలో ‘అక్షోటము’ అంటారు. హిందీ భాషలో అక్రోట్, అక్రూట్ అని పిలుస్తారు. దీని పేరు పర్షియన్ భాష నుంచి వచ్చింది. కాయలు పండిన తర్వాత మీద ఉన్న పెంకు తీసేసి కెర్నెల్ అంటారు. 15.23 గ్రాముల ప్రోటీన్లు ఇందులో లభిస్తాయి. క్రొవ్వు, కార్భోహైడ్రేట్లు కూడా అధిక స్థాయిలో ఉంటాయి. గింజలు, ఎండు ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కుంగుబాటు అంటే డిప్రెషన్ రాకుండా కాపాడతాయి. ఏకాగ్రత పెంచుకోవడానికి కూడా బాగా పని చేస్తాయి. అందుకే చదువుకునే పిల్లలకు వీటిని పెట్టాలని వైద్యులు సూచిస్తారు. తక్కువ పరిమాణంలో తిన్నప్పటికీ ఎక్కువ శక్తిని, పోషకాలను అందజేస్తాయి. 28గ్రాముల వాల్‌నట్లలో 2 గ్రాముల పీచు పదార్థం, 2.5 గ్రాముల మొక్కల ఆధారిత ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, 4గ్రాముల మాంసకృత్తులు లభిస్తాయి.
పోలిష్ భాషళో దీనిని ‘ఇటలీ పిక్క ’ అని అంటారు. బైజాంటైన్ కాలంలో వాల్ నట్‌ను ‘రాచ పిక్క’ అన పిలిచేవారు. స్పెయిన్‌లో ఈ చెట్లను పెంచినట్లుగా 12వ శతాబ్ధపు పుస్తకాలలో రాయబడి ఉన్నది. దీనిని ‘వెల్ష్ గింజ’ అని కూడా పిలిచేవారట. అంటే ఇది ఫ్రాన్స్ లేదా ఇటలీ ద్వారా జర్మన్ మాట్లాడే వారి నుండి వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రపంచం మొత్తం మీద వాల్ నట్‌లు 3.3 మిలియన్ టన్నులా ఉత్పత్తి జరుగుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. చైనా దేశం 33% వాల్ నట్లను ఉత్పత్తి చేస్తున్నది. అలాగే ఇరాన్, టర్కీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు వాల్ నట్లను ఉత్పత్తి చేసే దేశాలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
మన దేశంలో వాల్ నట్లను అత్యధికంగా ఉత్పత్తి చేసేది కాశ్మీర్ మాత్రమే. 90% నుండి 98% శాతం వరకు కాశ్మీర్ వాల్ నట్లను ఉత్పత్తి చేసే ప్రధాన ప్రాంతం. ఇవి ఎక్కువగా సమశీతోష్ణ ప్రాతంతాలలో పండుతాయి. వాల్ నట్‌ల పైన ఉండే పెంకు ఆధారంగా వర్గీకరిస్తారు. పలుచని పెంకు, కాగితం వంటి పెంకు, మధ్యస్థ పెంకు, గట్టి పెంకు అంటూ వాల్ పట్లను విడదీసి చెబుతారు. రోజుకు 30గ్రాముల వాల్ నట్లను తినవచ్చని తెలుస్తోంది. వాల్ నట్లను ఎక్కువ వేడిలో ఉంచితే చేదుగా మారిపోతాయట. చల్లని పొడి ప్రదేశాలలో నిల్వ చేయడం మంచింది. ఈ గింజలలో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. నేను కాశ్మీర్ వెళ్ళి ఈ చెట్లను చూసి తెలుసుకున్న విషయాలివి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి