విశ్వామిత్రుడు రంభను శపించుట : - ఎడ్ల లక్ష్మి -\సిద్దిపేట
ఇంద్రుని మాటలు కాదనలేక రంభ 
విశ్వామిత్రుని కోపానికి గురైయినది
ఆమె తప్పు లేదని గ్రహించి ముని
వశిష్టనిచే నీకు శాప విముక్తి కలుగును

విశ్వామిత్రుడు రంభకు అలా తెలిపగా
వెంబటే రంభశిలగా మారిపోయినది
శిలగా మారిన రంభనచట చూసి
మన్మధుడు ,ఇంద్రుడు మెల్లెగా వెళ్ళినారు
కోపముతో నా తపో బలము క్షీణించినది 

తపశక్తి తగ్గిపోవటం వలన ఆ మహాముని 
ఇక కోపానికి తావు ఇవ్వకుండా 
సదావేళలోశాంతిపరునిగా యుంటానని
ఇకనుండి నేను వందల వత్సరాలు

ఊపిరి బిగబట్టి కుంభకముగా నుండెదను
నా తపోనిష్టఫలముగా నాకు బ్రహ్మత్వం 
సిద్ధించువరకు తపోనిష్ట లో ఉంటాను 
గాలిని పీల్చక ఆహారమును స్వీకరింపక 
ఇంద్రియములను అదుపు చేయుచూ

 శరీరమును శుష్కింపచేయుదును
నేనెంత ఘోర తపస్సు చేసినా కానీ 
నా శరీరమునకు ప్రమాదము ఉండదు  
లోకాన ఎవరు చేయని తపస్సు చేస్తాను 


కామెంట్‌లు