*****
గదేందిరా అయ్యా! నీ దోత్తు పరేషాను గాడు గట్లుంటడేంది? శిన్నప్పుడు మాగనే ఉండేటోడు. పెరిగి పెరిగి పెద్దబావ కోతైండన్నట్టుంది గాని యవ్వారం.సూపుల్కి ముద్దుగుండుగని సుర్కుదనమే లేదు.
"అవ్వా! గిప్పట్కి వొంద త్యేపల శెప్పుంట.గాని పేరు పరేషాను గాదే పరాంకుశమని. గాన్ని సూత్తుంటే నీకే కాదు మాకు సుత పరేషానుగుంది.ఏం శేత గాదు. వాల్లయ్య కూడబెట్టిన సొమ్మును గద్దెమీద గణేశారి లెక్క అనుబవిత్తున్నడు. గాన్ని సూత్తుంటెనేమో ఎంత పెద్ద ఉజ్జోగం ఎలగపెడుతుండో ఏమో అనిపిత్తది.
మరి వాని ఆకారం సూత్తానికి గట్లుందిరా అయ్యా! ఓ పాలి మీ మేనత్త దాని దోత్తు ఓ దినం ఏం తోసట్లేదని ఇద్దరు గల్శి బంగారం దుకాణాలు,బట్టల దుకాణాలు సూత్తానికి ఎల్లిండ్రంట.గివి సూడ్రి మేడం గవి సూడ్రి మేడం అన్కుంట మీ అత్తెంటి బొయిన దోత్తుకి ఎక్కల్లేని యిల్వ యియ్యబట్టిండ్రంట.గా పొల్లేమో అయ్యొ గస్మంటియి ఏవన్న కొనాలంటే అగ్గో గామెనే. నాకెందుకు నేనేమన్న ఉజ్జోగం శేత్తనా ఏంది? అనంగనే నీ యత్తని,గామెని పైనించి కింది దనుక ఒక్క తీర్గ సూడబట్టిండ్రంట.అత్తను సూత్తుంటే గాళ్ళకి సద్వుకున్న దాన్లెక్క అగవల్లే.దాని దోత్తేమో బాగ సద్వుకున్న దాన్లెక్క అగవడి ఎక్కల్లేని యిల్వ మరియాద యియ్యబట్టిండ్రంట. గీ యిష్యం జెప్పి ఒకటే నవ్వబట్టిండ్రు. గప్పుడే అన్పిచ్చింది.కొంతమందిరి ఆకారాన్కి గట్ల కన్పిత్తరని."
"అవునే అవ్వా! నా దోత్తు సుత గట్లనే గని ఏదన్న పన్జేసి గా సోమర్తనాన్ని పోగొట్టుకొరా!. ముందుగాల ఏదన్న మొదలు బెట్టమని గాని అమ్మ నాయిన, నేను శెవునిల్లు గట్టుకొని శెప్తె ఇంటడా ఏంది? సోమర్పోతుల పోటీ బెడ్తే గీడే పస్టొత్తడవ్వా !"
"గంతేరా అయ్యా! కొంత మందిరి గట్లనే ఉంటరు."ఆకారముంటే శీకారముండదు" ఏందోరా మరి కొంత మందర్ని సూత్తుంటె దినాం ఎంత శెమటొడుత్తుండో, కట్టజీవో అన్పిత్తది.ఇంగ గాడు గంత కుషాల్గా ఉంటడంటే గందుకేనేమో అని సుత అన్పిత్తది తెల్సారా."
"అవునవ్వా! నువ్వన్న సామెత గీనస్మంటోన్ని జూసే పుట్టిచ్చుంటరవ్వా!"
'గీ దీన్నే మన పెద్దోళ్ళు ఇంకో తీర్గ సుత శెబ్తుంటరు. ఆకారాన్ని శీకారాన్ని కల్పి సూత్తే ఎట్ల. ఆకారముందంటే ఏదన్న మొదలువెడ్తెనే గద.మొదల్వెట్టినంక శీకారం ముచ్చెటెందుకు వొత్తది అంటరు.ఎట్లన్న అన్కోరా అయ్య ఆకారముంటే శీకారముండదు.శీకారం వుందంటె ఆకారం ముచ్చెట్నే లేదు. బాగా యిశారించు.సమజైతది."
"గట్లనే అవ్వా! గిందుల యిష్యం బలేగుంది!''
గదండీ సంగతి! ఆకారముంటే శీకారముండదు అంటే గిదే మరి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి