ఉత్సాహభరితంగా కాలిఫోర్నియా వీక్షణం అంతర్జాల సాహిత్య సమావేశం : -గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, వీక్షణం భారతీయ ప్రతినిధి.

  వీక్షణం 166వ సమావేశం  శనివారం ఉదయంఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. మొదట వీక్షణం సంస్థ అధ్యక్షురాలు స్వీయ పరిచయ కవులు రామాయణం ప్రసాదరావు మరియు ఉప్పలపాటి వెంకటరత్నం గార్లను మరియు సమావేశంలో పాల్గొన్న కవులకు, కవియిత్రులకు మరియు ఇతర సాహిత్య అభిమానులకు స్వాగతం పలికి సభను ప్రారంభీంచారు.
మొదట కావలి కవి రామాయణం ప్రసాదరావు తన కావలి జవహార్ భారతి కళాశాల చదువులనుండి ఇప్పటి వరకు సాగిన సాహిత్య ప్రస్థావాన్ని, తనపై భుజంగరాయ శర్మ ప్రభావాన్ని, ఆరుద్ర కవితల ప్రేరణను వివరించారు. యువకవులు బాగా చదివి తర్వాత కవితలు రాయాలని సూచించారు. పిమ్మట ఒంగోలు కవి ఉప్పలపాటి వెంకట రత్నం ఒంగోలు శర్మ కళాశాల తెలుగు ఉపన్యాసకుడు ధారా రామనాధ శాస్త్రి ప్రొత్సాహాన్ని, ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగ విరమణాంతరం తాను చేపట్టిన సాహితీ కార్యక్రమాలను గురించి సోదాహరణంగా వివరించారు. వారు ఇద్దరి ప్రసంగాలను సావధానంగా విన్న శ్రోతలు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు
పిమ్మట వీక్షణం భారతదేశ ప్రతినిధి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ మరియు కవిసమ్మేళన సామ్రాట్ డాక్టర్ రాధా కుసుమ సంయుక్త ఆధ్వర్యంలో కవిసమ్మేళనం జరిగింది. మొదట డాక్టర్ గీతా మాధవి రైలుబండి రాగం అనే కవితను చదివి అందరికీ బాల్యపు ఙ్ఞాపకాలను గుర్తుచేశారు. అమెరికా కవి కొత్తూరి వెంకట్ ఏడుకొండలస్వామి పద్యాలను, గంటా మనోహరరెడ్డి ఘంటారావం మినీ కవితలను, డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి చిక్కుల్లో తిండి కవితను, పరిమి వెంకట సత్యమూర్తి అవినీతిని అడ్డ్రస్సులేకుండా చేద్దాం అనే కవితను, అయ్యల సోమయాజుల ప్రసాద్ పితృదేవులు పరమేశ్వరులు అనే కవితను, ముప్పాళ్ళ భవాని హారతి పాటను, మేడ్చల్ కవి డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు అనంతావతారం కవితను, బాల సాహిత్య కవయిత్రి డాక్టర్ కందేపి రాణిప్రసాద్ ఆమె యుద్ధం అనే కవితను, డాక్టర్ కోదాటి అరుణ రైతన్నల వ్యధ అనే హృదయ విచారకర కవితను, శ్రీలతా ధవన్ అనుభవాలు - అవగాహన కవితను చదివి అందరినీ అలరించారు. ఒంగోలు కవి నాగేంద్రమ్మ చుక్కల్లో చంద్రుడు అనే గురజాడ అప్పారావు పై కవితను, రామాయణం ప్రసాదరావు ఓ కవీ అనే కవితను, ఉప్పలపాటి వెంకటరత్నం జారుడు మెట్లు అనే కవితను, మోటూరి నారాయణరావు మళ్ళీ గాయపరచవుకదా అనే కవితను, కరీంనగరం కవి వైరాగ్యం ప్రభాకరరావు 5 చమక్కుల నానీలను, డాక్టర్ బృందా మత్తోయ్ మత్తు అనే పాటను, మేడిసెట్టి యోగేశ్వరరావు ఎలా ఉన్నావు అనే చక్కని లయాత్మక కవితను, డాక్టర్ దేవులపల్లి పద్మజ నమ్రత కవితను, అవధానం అమృతవల్లి నాన్న నా విజయకేతనం అనే కవితను, న్యాయవాది లలితా చండి నాన్న పై కవితను, మందపాక అరుణకుమారి గృహసారధి అనే నాన్నపై కవితను, కొత్త ప్రియాంక భగీరధయఙ్ఞం కవితను, యువ కవయిత్రి ఆనం ఆశ్రితారెడ్డి నాన్న పై ఓలఘు కవితను, కట్టా శ్యామలాదేవి రైతుపరితాపం అనే కవితను, ప్రఖ్యాత కవి కందుకూరి శ్రీరాములు మహా ఇష్టం మర్రిచెట్టు కవితను, తిరుపతి కవి లింగుట్ల వెంకటేశ్వర్లు వెంకటేశ్వర స్వామి ప్రసాదం పై కవితను, బుక్కపట్నం రమాదేవి ఆ నలుగురు అనే కవితను, గాయకురాలు బలుసాని వనజ పితృదేవోభవ కవితను, అమీనా కలందర్ రాజ్యంలేని రాజు కవితను, కాకర్ల రమణయ్య ప్లాస్టిక్ భూతం కవితను, డాక్టర్ రాధా కుసుమ నేటి దృశ్యం అనే కవితను, భోగెల ఉమామహేశ్వరరావు నాన్నపై కవితను చదివి పాల్గొన్న కవిమిత్రులను ఆకట్టుకున్నారు. చివరగా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ కవితలు విన్న తర్వాత తెలుగు వెలుగైందని, మధురమైందని, గానమైందని, ప్రాణమైందని, రక్తమైందని, ఊపిరైందని, వర్షమైందని, మంత్రమైందని, కవితైందని, తల్లైందని అవేశంగా హావ భావాలతో ఆలపించి సభికులందరి మన్ననలు పొందారు.
సభాధ్యక్షురాలు సమావేశాన్ని చక్కగా నిర్వహించటంలో సహకరించిన స్వీయ పరిచయకర్తలు ఇద్దరికీ, కవి సమ్మేళన నిర్వహించిన ఇద్దరికీ మరియు చక్కని కవితలు వినిపించిన కవులకు ధన్యవాదాలు తెలిపి డాక్టర్ గీతా మాధవి కార్యక్రమాన్ని ముగించారు. చక్కని సాహిత్య సమావేశం నిర్వహించినందుకు సాహిత్యాభిమానులు వీక్షణం నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపి వచ్చేనెల సమావేశాం కొరకు ఎదురుచూస్తుంటామని చెప్పారు.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
మొల్ల విరులు;- .బి. అరుణ- పి జి టి - తెలుగు
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం