బోరబండలోని తెలంగాణ గురుకుల బాలుర పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ యోగాసనాలు, యోగ విన్యాసాలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.
పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమణమ్మ మాట్లాడుతూ, యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని, ప్రతి విద్యార్థి నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏటీపీ కె. రజని, డిప్యూటీ వార్డెన్ కె. వీరారెడ్డి, వి. గోవర్ధన్ రెడ్డి, కె. దామోదర్, కె. రాజశేఖర్, జి. బాలకృష్ణ, కె. రాజేశ్వరి, ఎన్. సురేష్, ఎం. వసంత, సి. ఉమారాణి, కె. కళావతి, ఎన్.ఓ రాజేశ్వరి, ఎం. ప్రవీణ్ కుమార్, కె. మాధవి, ఆయేషా, ఎన్. భరత్, సంగమేశ్వర్, కామేశ్వర రావు, జి. శ్రావంతి, ఆంజనేయులు, మహేష్ గౌడ్, ఎ. లత, సురేందర్ తదితర ఉపాధ్యాయ, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థులు చక్కగా యోగాసనాలు చేసినారు. యోగా ద్వారా ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా అందించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి