క్రొంగొత్త వెలుగునే తెచ్చురా
మంగళ వాయిద్యములతో
మనసు నిండిపోయెనురా
కళలతో కట్టిన ఇల్లు
కాంతులతో నిండెనురా
ప్రేమ పూల పరిమళమై
పండుగలా వెలిసెనురా
లక్ష్మీదేవి కొలువై ఇంట
సిరులను కురిపించురా
ఎల్లవేళలా ఇంటిలోపల
ఆనందం ఉప్పొంగునురా
పిల్ల పాపలకుతోడునీడయై
నడయాడే సదనమురా
అమ్మ నాన్నల నవ్వులు
అందరికి చిరుదీపమై
వెన్నెల వలె చల్లగాను
ప్రశాంత బాటను చూపునురా
అతిథు లందరు చనుదెంచి
నట్టింటిలో నడయాడిన
అన్నపూర్ణ కొలువుదీరి
అందరి ఆకలిదీర్చునురా
నోములు,పూజలు,యజ్ఞాలు
నట్టింటిలో బ్రాహ్మణులు చేయుచుండగా
గృహప్రవేశం సమయాన
సకలదేవతలు కొలువుదీరెదరు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి